Kolkata Doctor Murder: ఉన్మాది ఒక్కడేనా..? ఇంకా ఉన్నారా..? కోల్‌కతా వైద్యురాలి ఘటనలో విస్తుగొలిపే వాస్తవాలు

వాళ్లు మనుషులేనా.. మనిషి రూపంలో ఉన్న మృగలా..? ఒక్కరా..? చాలామందా..? ఆ రోజు అసలేం జరిగింది.. ఎందుకు మొదట ఆత్మహత్యగా పోలీసులు ఫోన్ చేసి చెప్పారు.. వాస్తవాలను దాచాలనుకున్నారా..? కావాలనే చెప్పారా..? ఉన్మాది ఒక్కడే అరెస్టయ్యాడు.. ఇంకా ఈ ఘటనలో ఎవరెవరి ప్రమేయం ఉంది..? ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో సందేహాలు..

Kolkata Doctor Murder: ఉన్మాది ఒక్కడేనా..? ఇంకా ఉన్నారా..? కోల్‌కతా వైద్యురాలి ఘటనలో విస్తుగొలిపే వాస్తవాలు
Kolkata Doctor Rape Murder
Follow us

|

Updated on: Aug 14, 2024 | 4:15 PM

వాళ్లు మనుషులేనా.. మనిషి రూపంలో ఉన్న మృగలా..? ఒక్కరా..? చాలామందా..? ఆ రోజు అసలేం జరిగింది.. ఎందుకు మొదట ఆత్మహత్యగా పోలీసులు ఫోన్ చేసి చెప్పారు.. వాస్తవాలను దాచాలనుకున్నారా..? కావాలనే చెప్పారా..? ఉన్మాది ఒక్కడే అరెస్టయ్యాడు.. ఇంకా ఈ ఘటనలో ఎవరెవరి ప్రమేయం ఉంది..? ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో సందేహాలు.. కోల్‌కత్తా ట్రెయినీ డాక్టర్ పై అత్యాచారం.. హత్య కేసు పై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా డాక్టర్‌ అత్యాచారం, హత్య కేసు దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఢిల్లీ నుంచి సీబీఐ ప్రత్యేక ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం కోల్‌కతాలో విచారణ చేపట్టింది.. క్రైమ్‌ సీన్‌ను సందర్శించి సీబీఐ అధికారులు ఆధారాలు సేకరించనున్నారు.. కాగా.. అత్యాచారం, హత్య కేసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తున్నాయి.. ఒక్కడే ఇదంతా చేశాడా..? లేక గ్యాంగ్ ఉన్నదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.. కాగా.. పోస్టుమార్టం రిపోర్టులో దారుణ విషయాలు వెలుగుచూశాయి.. పోస్ట్‌మార్టం నివేదిక క్రూరమైన దాడిని హైలైట్ చేసింది.. ప్రైవేట్ పార్ట్‌లో బహుళ గాయాలు, శరీరంపై ఎక్కడపడితే అక్కడ గాయాలు.. రక్తస్రావం.. గురించి వైద్యులు ప్రస్తావించారు.

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌ (31) పై ఆగస్టు 9వ తేది (శుక్రవారం) తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య అత్యాచారం, హత్య జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడించారు.. ఆమె ప్రైవేట్ భాగాలలో లోతైన గాయం కనిపించిందని.. బాధితురాలిని దారుణంగా ఉక్కిరిబిక్కిరి చేసి చంపేసినట్లు వైద్యులు తెలిపారు. గొంతు నులిమి చంపడంతో.. ఆమె థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిపోయినట్లు గుర్తించారు. బాధితురాలి ఉదరభాగం, పెదవులు, వేళ్లు, ఎడమ కాలికి గాయాలు ఉన్నాయి. ఆమె కళ్లు, నోరు, అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం జరిగినట్లు పోస్టుమార్టంలో తెలిపారు. బాధితురాలు కేకలు వేయకుండా నోరు, ముక్కు మూసి.. ఆమె తలను గోడకు లేదా నేలపై అదిమిపట్టినట్లు తెలిపారు. అసహజ లైంగిక చర్య.. పాశవిక దాడి కారణంగా జననాంగం, అంతర్గత అవయవాల వద్ద లోతైన గాయం కనిపించిందని.. దాడి సమయంలో బాధితురాలు గాఢ నిద్రలో ఉన్నందున నిందితుడికి కొంత ప్రయోజనం లభించిందని నివేదిక పేర్కొంది. ఆమె ప్రతిఘటించడానికి ప్రయత్నించిందని.. నిందితుడి చేతులపై లోతైన గాయాలు.. గీతలు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు.

ప్రాథమిక ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే..

సంజయ్ శరీరంపై ఉన్న స్క్రాచ్ మార్క్ గాయాలు, బాధితురాలి గోళ్ల నుంచి సేకరించిన చర్మం, రక్త నమూనాలతో సరిపోలాయి. ఒక సీనియర్ పోలీసు అధికారి ప్రకారం.. బాధితుడి వేలుగోళ్ల కింద రక్తం, చర్మం జాడలు రాయ్ DNA కి సరిగ్గా సరిపోలాయి.. దాడి సమయంలో తగిలిన గాయాలకు అనుగుణంగా ఉన్నాయి. బాధితురాలు సగం నిద్రలో ఉన్నప్పటికీ, ఆమె దాడి చేసిన వ్యక్తికి వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేసింది.. ఈ పోరాటమే రాయ్‌ని నేరంతో ముడిపెట్టడానికి అవసరమైన కీలకమైన సాక్ష్యాలను పరిశోధకులకు అందించింది.. అని తెలిపారు.

అసలేం జరిగిందంటే..

ఆర్‌జి కర్ హాస్పిటల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ రెండవ సంవత్సరం చదువుతున్న ట్రైనీ డాక్టర్‌ నైట్ డ్యూటీలో ఉంది.. బాధితురాలు భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి సెమినార్ హాల్‌కు వెళ్లింది. ఆ తర్వాత శవమై కనిపించింది. అత్యంత దారుణమైన స్థితిలో బాధితురాలు కనిపించింది. అనంతరం గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో కోల్‌కతా పోలీస్ సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే.. ఈ కేసులో పలువురిని విచారించారు.. అయితే.. అయితే.. ఈ ఘోరం వెనుక ఒక్కడే కాదని.. మరింత మంది ఉండొచ్చని సందేహాలు వ్యక్తమవుతున్నాయి..

ఈ ఘటన నేపథ్యంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం నాటికి కేసును ఛేదించలేకపోతే దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా పోలీసులను హెచ్చరించారు. ఈ క్రమంలోనే.. విచారించిన ధర్మాసనం.. సాక్ష్యాధారాలు తారుమారయ్యే అవకాశం ఉందని.. కేసును సీబీఐకి అప్పగించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
ఈ చిట్కాలు పాటిస్తే మీరు నూరేళ్లు జీవించడం ఖాయం..!
ఈ చిట్కాలు పాటిస్తే మీరు నూరేళ్లు జీవించడం ఖాయం..!
ప్రభాస్ సరసన మృణాల్ ఠాకూర్.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..
ప్రభాస్ సరసన మృణాల్ ఠాకూర్.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..
రూ.1578కే ఫ్లైట్ జర్నీ.. విస్తారా ఫ్రీడమ్ సేల్‌లో మతిపోయే ఆఫర్లు
రూ.1578కే ఫ్లైట్ జర్నీ.. విస్తారా ఫ్రీడమ్ సేల్‌లో మతిపోయే ఆఫర్లు
వన్ ప్లస్ ఫోన్లపై వావ్ అనే ఆఫర్లు.. ఏకంగా రూ.20 వేల వరకూ తగ్గింపు
వన్ ప్లస్ ఫోన్లపై వావ్ అనే ఆఫర్లు.. ఏకంగా రూ.20 వేల వరకూ తగ్గింపు
జెండాను ఎగురవేయడమే కాదు.. భద్రపర్చడం తెలియాలి..లేదంటే జైలే..!
జెండాను ఎగురవేయడమే కాదు.. భద్రపర్చడం తెలియాలి..లేదంటే జైలే..!
ఆ కళాకారుడి దేశభక్తికి ఫిదా అవ్వాల్సిందే.. చిరుధాన్యాలతో చక్కగా..
ఆ కళాకారుడి దేశభక్తికి ఫిదా అవ్వాల్సిందే.. చిరుధాన్యాలతో చక్కగా..
పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగదు.. పరువు తీసేసిన మాజీ ప్లేయర్
పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగదు.. పరువు తీసేసిన మాజీ ప్లేయర్
సిరిసిల్ల నేతన్న చేతిలో మువ్వన్నెల జెండా రెప..రెపలు..ఇక్కడి నుంచే
సిరిసిల్ల నేతన్న చేతిలో మువ్వన్నెల జెండా రెప..రెపలు..ఇక్కడి నుంచే
వెయ్యికిలోమీటర్ల పరిధితో స్వదేశీ డ్రోన్ల తయారీ..ఇక వారికి చుక్కలే
వెయ్యికిలోమీటర్ల పరిధితో స్వదేశీ డ్రోన్ల తయారీ..ఇక వారికి చుక్కలే
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..