Deal Volume: చైనాకు గట్టిపోటీస్తున్న భారత్.. ఆ రంగం వృద్ధిలో టాప్
వివిధ రంగాల్లో ప్రపంచ దేశాలు స్నేహపూర్వకంగా పోటి పడుతూ ఉంటాయి. ముఖ్యంగా సరిహద్దు దేశాలతో అన్ని రంగాల్లో పోటీపడుతూ ఉంటాయి. అలానే భారతదేశం కూడా చైనాతో పోటీపడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ రంగంలో చైనాకు గట్టిపోటీనిస్తుంది. ఇటీవల వెల్లడైన ఓ నివేదికలో ఈ విషయం స్పష్టం చేసింది.
జనవరి-అక్టోబర్ కాలంలో భారతదేశం డీల్ పరిమాణంలో 11.9 శాతం పెరుగుదలను చూసింది. ఇది ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మొత్తం ట్రెండ్‌ను బకింగ్ చేసిందని ప్రముఖ డేటా, అనలిటిక్స్ కంపెనీ గ్లోబల్‌డేటా నివేదిక తెలిపింది. మరోవైపు, ఈ కాలంలో చైనా డీల్ పరిమాణంలో 22.9 శాతం క్షీణతను చవిచూసింది. 2024 జనవరి నుంచి అక్టోబర్ వరకు ఆసియా-పసిఫిక్ (ఏపీఏసీ) ప్రాంతంలో మొత్తం 11,808 ఒప్పందాలు (విలీనాలు, కొనుగోళ్లు, ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ ఫైనాన్సింగ్ ఒప్పందాలు) ప్రకటించారు. 2023లో ఇదే కాలంలో ప్రకటించిన 12,406 డీల్‌లతో పోలిస్తే ఈ ఏడాది 4.8 శాతం క్షీణతను చవి చూసింది. జనవరి-అక్టోబర్ మధ్య కాలంలో ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ ఫైనాన్సింగ్ డీల్స్ వరుసగా 16.3 శాతం, 10 శాతం చొప్పున క్షీణించాయని ఒక విశ్లేషణ వెల్లడించింది.
అయితే ఈ సమీక్ష వ్యవధిలో ఎం&ఏ డీల్‌ల వాల్యూమ్ స్వల్పంగా మెరుగుదలను చవిచూసింది. ఏపీఏసీ డీల్ యాక్టివిటీ క్షీణించడం అనేది గ్లోబల్ ట్రెండ్‌కు అనుగుణంగా ఉంది. ఇందులో అన్ని ప్రాంతాలు డీల్ వాల్యూమ్‌లో పడిపోయాయి. ఏపీఏసీ ప్రాంతం సాపేక్షంగా మెరుగైన పనితీరును ప్రదర్శించింది. భారతదేశం వంటి కొన్ని ఏపీఏసీ దేశాల్లో అమలు చేస్తున్న ఒప్పంద కార్యకలాపాల మెరుగుదల వల్ల చైనా ఈ స్థాయి క్షీణతను చవిచూసిందని నివేదిక పేర్కొన్నారు. అలాగే సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఇండోనేషియాలు డీల్ పరిమాణంలో వరుసగా 17.6 శాతం, 14.4 శాతం, 13.9 శాతం, 33 శాతం క్షీణతను చవిచూశాయి.
అక్టోబర్‌లో వెలువడిన మరో నివేదిక ప్రకారం ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో భారతదేశంలో విలీనాలు, కొనుగోళ్ల ఒప్పంద కార్యకలాపాల విలువ 66 శాతం పెరిగింది. అంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా 10 శాతం వృద్ధిని అధిగమించింది. మొత్తం ఆసియా-పసిఫిక్ ప్రాంతం విషయానికి వస్తే 5 శాతం తగ్గింది. భారతదేశానికి సంబంధించిన ప్రత్యేక స్థితిస్థాపకత, ఆకర్షణ వల్ల ఈ స్థాయి వృద్ధి సాధ్యమైందని నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా టెక్నాలజీ, మీడియా, ఇండస్ట్రియల్స్, హెల్త్‌కేర్ వంటి రంగాలు ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవతో భారీ ఒప్పందాలకు కారణమయ్యాయని స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి