Ongole: ఓరి మీ బండబడ.. చివరకు మెడికల్ షాపులు కూడా వదలడం లేదుగా

Ongole: ఓరి మీ బండబడ.. చివరకు మెడికల్ షాపులు కూడా వదలడం లేదుగా

Ram Naramaneni

|

Updated on: Nov 20, 2024 | 1:53 PM

మెడికల్‌ షాపుల్లోనూ చోరీలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లూ గోల్డ్‌ షాపులు, సెల్‌ఫోన్‌ షాపుల్లోనే చోరీలు చూశాం.. ఇప్పుడు పంథా మార్చేశారు కేటుగాళ్లు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

ఒంగోలులో ఓ మెడికల్‌ షాపులో చోరీ జరిగింది… నగరంలోని రాంనగర్ 4వ లైన్ లోని డార్విన్ ఫార్మసీ మెడికల్ షాపులో రాత్రి 2 గంటల సమయంలో దొంగలు పడ్డారు… షాపు బయట ఉన్న సిసి కెమెరాలను పక్కకు తిప్పి మారు తాళాలతో షట్టర్‌ తాళం తెరిచారు… అనంతరం గునపంతో షట్టర్‌ను పైకి లేపి లోపలికి ప్రవేశించారు… మెడికల్‌ షాపంతా కలియ తిరిగి డబ్బుల కోసం వెతికారు… గల్లాపెట్టెలో ఉన్న 20 వేల నగదును తీసుకుని ఉడాయించారు… దొంగలు షాపు లోపల ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను గమనించకపోవడంతో దొంగల బాగోతమంతా రికార్డయింది… అనంతరం అక్కడి నుంచి దొంగలు ఉడాయించారు… ఉదయం షాపు తెరిచిన యజమాని తన షాపులో చోరీ జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు… సిసి కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దొంగల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు… దొంగలు అక్కడే వదిలి వెళ్లిన గునపాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..