AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మెన్స్‌ డే రోజు.. నిజమైన మగాడంటే ఎవరో చెప్పిన మహేశ్ బాబు

Mahesh Babu: మెన్స్‌ డే రోజు.. నిజమైన మగాడంటే ఎవరో చెప్పిన మహేశ్ బాబు

Phani CH
|

Updated on: Nov 20, 2024 | 1:44 PM

Share

ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా నిజమైన మగాడు అంటే ఎలా ఉంటాడో చెప్పారు మహేష్ బాబు. మగవారి గొప్పతనంపై ఒక వాయిస్ నోట్ విడుదల చేసారీయన. తెలుగులో మహేష్ బాబు ఈ వాయిస్ ఇవ్వగా.. హిందీలో ఫర్హాన్ అక్తర్, మరాఠీలో సచిన్ టెండూల్కర్, పంజాబీలో యువరాజ్ సింగ్, బెంగాలీలో షాన్ వాయిస్ నోట్ ఇచ్చారు.

ఇక మహేష్ వాయిస్ విషయానికొస్తే.. ‘ఎవరి కళ్ళల్లో సంస్కారం సూర్య కాంతిలా మెరుస్తుందో, ఎవరి మాట మన్ననగా ఉంటుందో, ఎవరి మనసు మెత్తగా ఉంటుందో, ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో, ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం, సమాజంలో గౌరవం ఉంటాయో, వారి ఆత్మగౌరవానికి విలువ ఇస్తారో, ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్కక్షణం కూడా మరిచిపోరో, స్త్రీకి శక్తి ఉంది, గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉండాలని ఎవరు మనస్ఫూర్తిగా అనుకుంటారో, ఎవరికి దగ్గరగా ఉంటే వాళ్ళకు ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో, అలాంటి వాడు స్త్రీకి నిజమైన సహచరుడు, స్నేహితుడు.. ఒక్క మాటలో చెప్పాలంటే వాడే నిజమైన మగాడు’ అంటూ చెప్పుకొచ్చారు మహేష్ బాబు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: ఆ స్టార్‌కు ఇచ్చిన మాట కోసమే కడప దర్గాకు వచ్చా..

భారత్‌లో మరిన్ని “ట్రంప్ టవర్స్‌” ప్రారంభానికి ట్రంప్ జూనియర్

1000 రోజుల యుద్ధం.. మరో ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందా ??

Sai Pallavi: హీరోకు సమానంగా సాయి పల్లవికి రెమ్యునరేషన్ !! ఇదే ఇప్పుడు గొడవకు కారణం

Anchor Ravi: మొత్తానికి అనుకున్నది సాధించిన యాంకర్ రవి