Shiva Shakti: చంద్రయాన్ ల్యాండ్ అయిన ప్రదేశాన్ని శివశక్తిగా ఎందుకు నామకరణం చేశారో తెలుసా..?
చంద్రుని మీద మువ్వన్నెల రెపరెపలతో.. ప్రపంచ దేశాలకు మన సత్తా ఏంటో తెలియజేశామన్నారు. చంద్రయాన్ -3 విజయవంతం సరికొత్త భారతావనికి వేకువని కొనియాడారు.. జై విజ్ఞాన్, జై అనుసంధాన్ తోపాటు.. జై కిసాన్.. జై జవాన్.. జై విజ్ఞాన్.. అంటూ నినదించారు. అంతరిక్షరంగంలో చంద్రయాన్-3 బెంచ్‌మార్క్‌ను నెలకొల్పిందంటూ పేర్కొన్న ప్రధాని మోడీ.. పలు కీలక ప్రకటనలు చేశారు. ఆగస్టు 23న ఏటా నేషనల్ స్పేస్ డే జరుపుకోనున్నట్లు ప్రకటించారు.

అంతరిక్షంలో భారతదేశం జెండా రెపరెపలాడుతోంది. భారత్ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది.. జాబిల్లిపై మన ప్రగ్యాన్ రోవర్ సూపర్ సక్సెస్‌ఫుల్‌గా చక్కర్లు కొడుతోంది.. ఈ క్రమంలో విదేశీ పర్యటన నుంచి నేరుగా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రయాన్-3 శాస్త్రవేత్తలను కలుసుకుని వారిని అభినందించారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడానికి తనను తాను ఆపుకోలేక నేరుగా బెంగుళూరు వచ్చానంటూ పేర్కొన్నారు. చంద్రుని మీద మువ్వన్నెల రెపరెపలతో.. ప్రపంచ దేశాలకు మన సత్తా ఏంటో తెలియజేశామన్నారు. చంద్రయాన్ -3 విజయవంతం సరికొత్త భారతావనికి వేకువని కొనియాడారు.. జై విజ్ఞాన్, జై అనుసంధాన్ తోపాటు.. జై కిసాన్.. జై జవాన్.. జై విజ్ఞాన్.. అంటూ నినదించారు. అంతరిక్షరంగంలో చంద్రయాన్-3 బెంచ్‌మార్క్‌ను నెలకొల్పిందంటూ పేర్కొన్న ప్రధాని మోడీ.. పలు కీలక ప్రకటనలు చేశారు. ఆగస్టు 23న ఏటా నేషనల్ స్పేస్ డే జరుపుకోనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా.. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయిన ప్రదేశాన్ని ‘శివశక్తి’గా పిలుస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ.. చంద్రయాన్-2 రోవర్ చంద్రుడిని తాకిన ప్రాంతాన్ని ‘తిరంగా’ పాయింట్‌గా పేరు పెడుతున్నామన్నారు. ప్రాచీన ఋషుల కాలాన్ని ప్రస్తావిస్తూ.. అంతరిక్ష రహస్యాలను మన రుషులు ఏనాడో వివరించారని గుర్తుచేశారు మోదీ. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశ వైజ్ఞానిక శక్తిని.. మన సాంకేతికతను, మన శాస్త్రీయ స్వభావాన్ని అంగీకరిస్తున్నాయన్నారు. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 దిగిన క్షణం.. ఇప్పుడు అమరత్వం చెందిందని.. దీనిలో నారీ శక్తి కృషి కూడా ఎంతో ఉందని.. ఆ ప్రాంతానికి శివశక్తిగా ఎందుకు నామకరణం చేస్తున్నామో కూడా వివరించారు.
మూన్ మిషన్ టచ్ డౌన్ పాయింట్‌కి పేరు పెట్టే సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. మన చంద్రయాన్ ల్యాండ్ అయిన చంద్రుని భాగానికి పేరు పెట్టాలని కూడా భారత్ నిర్ణయించింది. దీనిలో భాగంగా చంద్రయాన్ -3 ల్యాండర్ ల్యాండ్ అయిన ప్రదేశాన్ని ఇప్పటినుంచి ‘శివ-శక్తి’ అని పిలువనున్నారు. అసలు మోడీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు. శివశక్తికి ఉన్న ప్రాధాన్యం ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అసలు శివ శక్తిగా ఎందుకు నామకరణం తెలుసా..?
శివుని ఆజ్ఞ లేనిదే చీమ అయిన కుట్టదంటారు.. వాస్తవానికి శివుడిని.. సర్వేశ్వరుడు సర్వాంతర్యామిగా కొలుస్తారు.. సర్వజ్ఞుడు, సర్వలోకాల ప్రభువు, సృష్టికర్త , ఆదిఅంతం లేనివాడు.. అందుకే శివుడిని శక్తికి కేంద్రంగా అభివర్ణిస్తారు. చంద్రుని శివశక్తి కేంద్రం.. హిమాలయాలు కన్యాకుమారితో అనుసంధానించిన భావాన్ని కలిగిస్తాయి. అందుకే.. ఇప్పుడు ఆ పాయింట్‌ను ‘శివ-శక్తి’గా నామకరణం చేశారు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు.. కావున శవశక్తిగా నామకరణం చేసినట్లు పేర్కొంటున్నారు. పరమ మంగళకరమైనది శివ స్వరూపం. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా పేర్కొంటారు. అందుకే నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొన్నారు. ఇలా చంద్రునిపై చంద్రయాన్ ల్యాండ్ అయిన ప్రాంతానికి ప్రధాని మోడీ ఆ పేరు పెట్టాలని భావించినట్లు తెలుస్తోంది.
‘‘మిషన్ టచ్ డౌన్ పాయింట్‌కి పేరు పెట్టే సంప్రదాయం ఉంది. మన చంద్రయాన్ ల్యాండ్ అయిన చంద్రుని భాగానికి పేరు పెట్టాలని కూడా భారత్ నిర్ణయించింది. చంద్రయాన్ -3 ల్యాండర్ ల్యాండ్ అయిన ప్రదేశం, ఇప్పుడు ఆ పాయింట్‌ను ‘శివ-శక్తి’ అని పిలుస్తారు. మానవాళి సంక్షేమానికి సంబంధించిన తీర్మానాన్ని శివుడు కలిగి ఉన్నాడు.. శివశక్తి మనకు ఆ తీర్మానాలను నెరవేర్చగల సామర్థ్యాన్ని ఇస్తుంది. చంద్రుని శివశక్తి కేంద్రం హిమాలయాలు కన్యాకుమారితో అనుసంధానించబడిన భావాన్ని ఇస్తుంది.’’ అని మోడీ పేర్కొన్నారు.
చంద్రయాన్3 చంద్రునిపై ల్యాండ్ అయిన ప్రాంతానికి శవశక్తిగా నామకరణంచేసిన ప్రధాని మోడీ.. అంతరిక్షం, సాంకేతికత రంగంలో భారత్ కచ్చితంగా ప్రపంచ అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఈ పరిశోధన శక్తి భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని.. 2047లో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తుందన్నారు. భారతదేశంలోని గ్రంథాలలో ఉన్న ఖగోళ సూత్రాలను శాస్త్రీయంగా నిరూపించడానికి, కొత్త తరాలు వాటిని కొత్తగా అధ్యయనం చేయడానికి ముందుకు వచ్చాయన్నారు. ఇది మన వారసత్వంతో పాటు సైన్స్‌కు కూడా ముఖ్యమైనదని మోడీ వివరించారు. అయితే, చంద్రయాన్-2 వైఫల్యం నుంచి నేర్చుకున్న భారత శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 మిషన్‌లో విజయం సాధించారు. అందుకే.. చంద్రునిని తాకిన చంద్రయాన్ 2.. తిరంగా పాయింట్ భారతీయులకు స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ అభివర్ణించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..