Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Delhi: రాఖీ కట్టేందుకు తమ్ముడు కావాలని కోరిన కూతురు.. అర్థరాత్రివేళ ఆ దంపతులు ఏం చేశారంటే..

అమ్మాయిలకు అన్నా, తమ్ముళ్లు లేని వారు చాలా బాధపడిపోతారు. తమ చుట్టూ ఉన్నవారు రాఖీని సెలబ్రేట్ చేసుకుంటుంటే.. తమకు రాఖీ కట్టే, కట్టించుకునే అవకాశం లేక బాధపడుతారు. ఓ చిన్నారి బాధ ఆ తల్లిదండ్రులను మరింత కుమిలిపోయేలా చేసింది. ఆ బాధ వారిని క్రైమ్ వైపు ఉసిగొల్పింది. ఓ పిల్లాడిని కిడ్నాప్ చేసేలా ప్రోత్సహించింది. దేశ రాజధాని ఢిల్లీలో తమ కూతురు రాఖీ కట్టేందుకు తమ్ముడు కావాలని ఏడుస్తుండటంతో..

New Delhi: రాఖీ కట్టేందుకు తమ్ముడు కావాలని కోరిన కూతురు.. అర్థరాత్రివేళ ఆ దంపతులు ఏం చేశారంటే..
Delhi Couple Arrest
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 26, 2023 | 3:27 PM

రాఖీ పౌర్ణమి వస్తోందంటే చాలు అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు ఫుల్ ఖుషీ అవుతారు. అదే సమయంలో అబ్బాయిలకు అక్కా, చెల్లెళ్లు లేని.. అమ్మాయిలకు అన్నా, తమ్ముళ్లు లేని వారు చాలా బాధపడిపోతారు. తమ చుట్టూ ఉన్నవారు రాఖీని సెలబ్రేట్ చేసుకుంటుంటే.. తమకు రాఖీ కట్టే, కట్టించుకునే అవకాశం లేక బాధపడుతారు. ఓ చిన్నారి బాధ ఆ తల్లిదండ్రులను మరింత కుమిలిపోయేలా చేసింది. ఆ బాధ వారిని క్రైమ్ వైపు ఉసిగొల్పింది. ఓ పిల్లాడిని కిడ్నాప్ చేసేలా ప్రోత్సహించింది. దేశ రాజధాని ఢిల్లీలో తమ కూతురు రాఖీ కట్టేందుకు తమ్ముడు కావాలని ఏడుస్తుండటంతో.. ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. దాంతో ఏం చేయాలో తెలియక.. చివరకు బాబును కిడ్నాప్ చేయాలని నిర్ణయించి, ఆ ప్రయత్నం చేశారు. అయితే, అదికాస్తా బెడిసికొట్టడంతో ఆ దంపతులు కటకటాలపాలయ్యారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆగష్టు 24వ తేదీన ఢిల్లీలోని కొత్వాలి ప్రాంతంలోని ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రుల మధ్యలో నిద్రిస్తున్న నెల వయసున్న చిన్నారిని కిడ్నాప్ చేశారు దంపతులు. అయితే, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. నిందితులు పట్టుబడ్డారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే, ఈ దంపతులు చిన్నారిని కిడ్నాప్ చేయడం వెనుక విషాదకరమైన అంశం ఉంది. అదేంటంటే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దంపతుల కుమారుడు గతేడాది టెర్రస్ పై నుంచి పడి చనిపోయాడు. అయితే, ఈ విషయం తమ కూతురు(17)కి తెలిదు. దూరంగా ఉండి చదువుకుంటున్న కారణంగా ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదని చెప్పలేదు. అయితే, మరికొద్ది రోజుల్లో రాఖీ పండుగ వస్తున్న నేపథ్యంలో.. తాను తన సోదరుడికి రాఖీ కట్టాలని అనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. చనిపోయిన కొడుకుని తిరిగి తీసుకురాలేం.. అలాగని చనిపోయిన విషయాన్ని కూతురుకు చెప్పలేక సతమతం అయిపోయారు. ఈ క్రమంలో ఓ అబ్బాయిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశారు దంపతులు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే.. ఆగష్టు 24వ తేదీన తల్లిదండ్రులు తమ పిల్లాడిని మధ్యలో పెట్టుకుని చట్టా రైల్ చౌక్ వద్ద నిద్రిస్తున్నారు. అయితే, తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తమ నెల వయసున్న కొడుకు కనిపించకుండా పోయాడని, ఎంత వెతికినా కనిపించడం లేదంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. బైక్‌పై వచ్చిన భార్యాభర్త జంట.. అనుమానాస్పదంగా అదేచోట పలుమార్లు తిరుగుతూ కనిపించారు. దాంతో వారి ఆచూకీ కనిపెట్టి విచారించారు పోలీసులు. దాంతో అసలు మ్యాటర్ చెప్పారు. కూతురి రాఖీ కట్టేందుకు సోదరుడు కావాలని పట్టుపట్టడంతోనే.. తాము ఇలా కిడ్నాప్ చేశామని చెప్పుకొచ్చారు. దంపతులపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..