Lifestyle For Environment: పర్యావరణం పచ్చగా ఉంటేనే బాగుంటేనే మనం బాగుంటాం.. ఈ విషయం తెలిసినా చాలామంది పట్టించుకోరు.. పర్యావరణ పరిరక్షణలో ఇప్పటినుంచైనా భాగస్వామ్యమై.. ఇప్పటినుంచి మనవంతు సాయం చేద్దాం.. పర్యావరణం కలుషితం కాకుండా చేయి చేయి కలుపుదాం.. మొక్కలను పెంచుదాం.. ప్రకృతిని పరిరక్షించుకుందాం.. భావి తరాలను కాపాడుకుందాం.. జూన్ 5, 1973 నుంచి ప్రాంరభమైన పర్యావరణ పరిరక్షణ ఉద్యమం నేటికి నిరంతరాయంగా కొనసాగుతోంది. జూన్ 5న 50 ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భారత ప్రభుత్వం ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. మై ఇండియా – మై లైఫ్ గోల్స్ పేరుతో.. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ మూవ్‌మెంట్ నినాదంతో చేపట్టిన ఈ పర్యావరణ ఉద్యమానికి టీవీ9 నెట్‌వర్క్ కూడా భాగస్వామిగా ఉంది. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం.. వారిని భాగస్వామ్యం చేయడం ఈ ఉద్యమ లక్ష్యం..
అయితే, ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న హర్యానా ట్రీమ్యాన్ దేవేంద్ర సుర కీలక వ్యాఖ్యలు చేశారు. చేసేది పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగమైనా.. ప్రకృతి మాత కోసం ఏదైనా చేయాలన్న ఆలోచనతో పర్యావరణ పరిరక్షణకు పాటుపడినట్లు తెలిపారు. 2011లో చండీగఢ్‌లో కానిస్టేబుల్‌గా చేరానని.. నగరంలో ఏపుగా పెరిగిన చెట్లు ఆ పచ్చదనం చూసి ప్రకృతి మాత కోసం ఏదైనా చేయాలన్న ఆలోచన కలిగిందని దేవేంద్ర సుర పేర్కొన్నారు. యువకుల సహకారంతో అప్పట్నుంచి గ్రామాలలో ఏటా 20 నుంచి 25 వేల మొక్కలు నాటుతున్నామన్నారు. ఈ ఉద్యమంలో గ్రామస్థులనూ భాగం చేస్తున్నామని దేవేంద్ర సుర వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..