Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nirmala Sitharaman: ఆర్ధిక లెక్కలతో కుస్తీ పెట్టే నిర్మలమ్మ ఒక్కసారిగా నవ్వింది.. వీడియో చూస్తే..

ఓ వైపు ఆర్ధిక లెక్కలు.. మరో వైపు సభ్యులు అడిగే ప్రశ్నలు.. ఎవరు ఏ ప్రశ్న వేసిన తనదైన లెక్కతో జవాబు చెప్పే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నవ్వడం గురువారం సభలో ప్రత్యేకంగా నిలిచింది. గురువారం పార్లమెంట్‌లో ప్రధాని మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షాలపై విరుచుకుపడిన ప్రధాని, ప్రతిపక్షాలు పాకిస్థాన్‌ను ప్రేమిస్తున్నాయని అన్నారు. తమ దేశ సైన్యాన్ని విడిచిపెట్టిన పాకిస్థాన్ వాదనలను ప్రతిపక్షాలు విశ్వసిస్తున్నాయని అన్నారు.

Nirmala Sitharaman: ఆర్ధిక లెక్కలతో కుస్తీ పెట్టే నిర్మలమ్మ ఒక్కసారిగా నవ్వింది.. వీడియో చూస్తే..
Nirmala Sitharaman
Follow us
Sanjay Kasula

| Edited By: TV9 Telugu

Updated on: Aug 11, 2023 | 1:46 PM

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇస్తూ కాంగ్రెస్‌ను .. విపక్షాలను చీల్చిచెండాడారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విపక్షాలు చర్చ నుంచి పారిపోయాయని విమర్శించారు. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిపై ప్రధాని మోదీ గురువారం విరుచుకుపడ్డారు. మన దేశాన్ని కాకుండా పాకిస్థాన్‌ను ప్రతిపక్షాలు ప్రేమిస్తున్నాయని విమర్శిచారు. రాబోయే 5 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడిన ప్రధాని మోదీ.. అందులో ప్రతిపక్షాలను గాలికొదిలేసి.. వచ్చే ఐదేళ్లలో అంటే మూడో టర్మ్‌లో దేశ ఆర్థిక వ్యవస్థను మూడో స్థానానికి తీసుకెళ్తామని చెప్పినప్పుడు.. ఎలా ముందుకు తెస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నించాలి.. ఎలా చేస్తారు అంటూ ఆర్ధిక మంత్రిని అడగాలి..ఈ ప్రశ్నలన్నింటిపై మీ రోడ్ మ్యాప్ ఏంటీ అంటూ ప్రతిపక్షాలు అడగాలి.. కానీ ప్రతిపక్షాలు అలా చేయడం లేదు. ఏ ప్రశ్న వేయాలో కూాడా ప్రతిపక్షాలకు తానే నేర్పించాలా..? అని అనడంతో సభ మొత్తం నవ్వుకుంది.

ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకురావడానికి ప్రతిపక్ష నాయకులు నాకు ఏదైనా సలహా లేదా మరేదైనా సహాయం చేసి ఉండవచ్చు కానీ కాంగ్రెస్ రాజకీయాలు భిన్నంగా ఉన్నాయని మోదీ విమర్శిచారు. ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా నిరాధారంగా మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. ఏమీ చేయకుండానే మూడో స్థానానికి చేరుకుంటామని కాంగ్రెస్ అంటోంది. అంతా ఇలాగే జరుగుతుందని కాంగ్రెస్‌ చెబుతుంటే.. ఖచ్చితంగా కాంగ్రెస్‌కు రోడ్‌ మ్యాప్‌ లేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఆ సమయంలో మీరు ఏ ప్రశ్న వేయాలో కూడా నేనే చెప్పాలా అంటూ ప్రధాని మోదీ అనడంతో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నవ్వడం సభలో ప్రత్యేకంగా నిలిచింది.

అవిశ్వాసంపై చర్చలో విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. మణిపూర్‌పై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు సభ నుంచి పారిపోయాయని మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్ర ప్రజలపై కాంగ్రెస్‌కు ప్రేమ లేదన్నారు మోదీ. భారతమాతను రాహుల్‌గాంధీ పార్లమెంట్‌ సాక్షిగా అవమానించారని అన్నారు.

2018లో కూడా విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయన్నారు మోదీ. అవిశ్వాస తీర్మానం తమకు బలపరీక్ష కాదని విపక్షాలకే బలపరీక్ష అని అప్పుడే తాను చెప్పినట్టు తెలిపారు. 2024 ఎన్నికల్లో కూడా విపక్షాలకు ఇప్పటికంటే తక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. విపక్ష కూటమి తమను తాము రక్షించుకోవడానికి ఎన్డీఏ సహకారం తీసుకున్నారని సెటైర్‌ విసిరారు మోదీ. ఇండియాను ముక్కలు చేసి విపక్ష కూటమి అవతరించిందన్నారు. దేశ ప్రజల పట్ల విపక్షాలు విశ్వాస ఘాతుకానికి ఒడిగట్టాయన్నారు.

వీటన్నింటి మధ్య ప్రధాని మోదీ ప్రసంగాన్ని వినేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సభలో లేరు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం, సాయంత్రం 4 గంటలకు ప్రధాని ప్రసంగం చేయాల్సి ఉండగా, రాహుల్ గాంధీ సమావేశానికి వచ్చే వరకు వేచి ఉన్నారు. పీఎం సీటుకు రాగానే పార్లమెంట్ వచ్చింది.. కానీ ప్రధాని మోదీ 5 గంటల వరకు మాట్లాడకపోవడంతో రాహుల్ 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను అంటూ వెళ్లిపోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం