భోజనం తిన్న తర్వాత మీరూ టీ తాగుతున్నారా?

09 March 2025

TV9 Telugu

TV9 Telugu

టీ అనే మాట వింటే చాలు.. ఎక్కడ లేని హుషారూ వస్తుంది. అలసట, నీరసం మాయమై రీచార్జయిపోతాం. కొందరు ఒకట్రెండుసార్లే తాగితే.. ఇంకొందరు గంటగంటకీ ఓ గుటక పడాల్సిందే అంటారు 

TV9 Telugu

మన పని మొదలవ్వాలన్నా.. ఇంట్లో వాళ్లలో పొద్దున్నే చురుకు పుట్టించాలన్నా.. గుర్తొచ్చేది టీనే! దానివల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. కాఫీ తర్వాత, ఎక్కువగా తీసుకునే పానీయం టీ

TV9 Telugu

భారతీయులే కాదు, యూరప్, అమెరికా దేశాల్లో కూడా టీ రుచులకు ఫిధా అయ్యేవారున్నారు. టీ సోమరితనాన్ని తొలగించి చురుకుగా మారుస్తుంది

TV9 Telugu

టీ తాగిన తర్వాత అలసట లేకుండా, తాజాగా ఉన్నట్లు ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అయితే కొంతమందికి భోజనం తర్వాత టీ తాగే అలవాటు ఉంటుంది. ఇలా తిన్న వెంటనే టీ తాగడం హానికరం అంటున్నారు నిపుణులు

TV9 Telugu

భోజనం చేసిన వెంటనే  టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందట. భోజనంలోని పోషకాలను గ్రహించడంలో సమస్యలు వస్తాయంటున్నారు

TV9 Telugu

ముఖ్యంగా మీకు డయాబెటిస్ ఉంటే, భోజనం చేసిన తర్వాత టీ తాగే అలవాటును వెంటనే మార్చుకోవాలి. ఇది రక్తంలో చక్కెరను పెంచుతుంది

TV9 Telugu

భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఇందులో అధిక మొత్తంలో కెఫిన్ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో టీ తాగక పోవడమే మంచిది

TV9 Telugu

జీర్ణసంబంధ సమస్యలు, అసిడిటీ వంటి సమస్యలు ఉంటే వైద్యులిచ్చే సూచనల మేరకు టీ, కాఫీ మానేయటం బెటర్‌. టీ మెదడును ఉత్తేజితం చేస్తుందన్న మాట నిజమే. కానీ అసిడిటీకీ కారణమవుతుంది