Patanjali Mega Food Park: పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ ప్రారంభం.. నాగ్‌పూర్ సీఎం ఫడ్నవీస్ హాజరు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. దీనిని నిర్మించడానికి 9 సంవత్సరాల సమయం పట్టిందని అన్నారు. పలు రాష్ట్రాల్లో ఉచితంగా ఇస్తున్న భూమిలో ఫుడ్ పార్క్ నిర్మించడానికి బదులుగా, బాబా రామ్‌దేవ్ నాగ్‌పూర్‌ను ఎంచుకుని, ఇక్కడి భూమికి ధర చెల్లించి దానిని పూర్తి చేశారని అన్నారు..

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ ఆదివారం (మార్చి 9) ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. బాబా రామ్‌దేవ్ ఇద్దరికీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మాట్లాడుతూ.. విదర్భ ప్రజల తరపున బాబా రామ్‌దేవ్, న ఆచార్య బాలకృష్ణకి కృతజ్ఞతలు తెలిపారు. 9 యేళ్ల క్రితం ఇదే రోజున మెగా ఫుడ్ పార్క్ కు పునాది వేసిన విషయం నాకు గుర్తుందని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారు. చాలా సమస్యలు తలెత్తాయి. నేను రామ్‌దేవ్, ఆచార్యతో మాట్లాడినప్పుడల్లా వారు నాగ్‌పూర్ గురించి నన్ను ఆందోళన చెందవద్దని, మేము ఈ పనిని పూర్తి చేస్తామని చెప్పారు. వారు అన్నట్లుగానే దానిని పూర్తి చేసి నిరూపించారు. ఈ మేరకు సంభాషణ జరుగుతుండగా పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్‌లో తయారైన జ్యూస్ తాగుతూ చాలా బాగుందని ముఖ్యమంత్రి అన్నారు.
భూమిని ఉచితంగా ఇవ్వలేదు.. సీఎం ఫడ్నవీస్
బాబా రామ్‌దేవ్‌ను నాగ్‌పూర్‌కు ఆహ్వానించినప్పుడు.. అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయనకు ఉచితంగా భూమి ఇస్తామని ఫోన్ చేసినట్లు సీఎం ఫడ్నవీస్ అన్నారు. అయితే తాను, గడ్కరీ.. కలిసి బాబా రాందేవ్‌ని తమ రాష్ట్రానికి అహ్వానించడంతో ఆయన నాగ్‌పూర్‌కే వస్తానని చెప్పారన్నారు. అయితే తమ ప్రభుత్వం రామ్‌దేవ్ బాబాకు ఉచితంగా భూమి ఇవ్వలేదని, దాని టెండర్ కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. మేము పారదర్శకతను కాపాడుకోవాలి. కాబట్టి భూమికి అత్యధిక ధర ఇచ్చేవారికి మాత్రమే భూమి ఇస్తామని చెప్పామన్నారు. అత్యధిక ధర చెల్లించి మీరు భూమి కొనుగోలు చేయాలనేదే మా కోరిక అని కోరామన్నారు. అయితే బాబా రామ్‌దేవ్ కూడా ఈ సవాలును స్వీకరించారన్నారు. దీనికి మూడుసార్లు టెండర్లు జారీ చేయగా.. మూడుసార్లు కూడా పతంజలి తప్ప ఎవరూ దానిని తీసుకోవడానికి ముందుకు రాలేదని తెలిపారు.
నారింజ బోర్డు ఏర్పాటు
ఈ పార్కులో నారింజ పండ్ల కోత నుంచి ప్రాసెసింగ్ వరకు మొత్తం ప్రక్రియ ఒకే చోట జరుగుతుందని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చెప్పారు. దీనివల్ల నారింజ పండ్ల వృధా తగ్గుతుందని, రైతులకు మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయన్నారు. పతంజలి అన్ని రకాల నారింజలను వాటి పరిమాణం లేదా నాణ్యతతో సంబంధం లేకుండా ఉపయోగిస్తునట్లు తెలిపారు. అంతేకాకుండా తొక్క, గింజలను కూడా ఉపయోగించడం ద్వారా వృధా ఉండదని, గరిష్ట ఉత్పత్తిని సాధించవచ్చన్నారు. ఈ పార్కులో ఆధునిక శీతల గిడ్డంగి సౌకర్యాలు కూడా ఉన్నాయన్నారు. ఇక్కడ రైతులు తమ ఉత్పత్తులను సురక్షితంగా ఇక్కడ నిల్వ చేసుకోవచ్కని, వారు కోరుకున్నప్పుడల్లా వాటిని అమ్మవచ్చన్నారు. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి వారిని రక్షించడంలో సహాయపడుతుందని తెలిపారు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. పతంజలి ఇక్కడ నారింజ మొక్కల నర్సరీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఈ ప్రాంతంలో నారింజ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఆరెంజ్ బోర్డు ఏర్పాటు ప్రకటన నారింజ ఉత్పత్తిదారులకు మరింత సహాయం అందిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








