శరీరానికి ఎంత ఎక్కువగా నీళ్లు అందిస్తే అంత ఆరోగ్యంగా ఉంటాము. కేవలం నీళ్లకు మాత్రమే ఎందుకు పరిమితం కావాలి? మరింత పోషకాలుండే నీళ్లను ఎందుకు తాగకూడదు
TV9 Telugu
సహజసిద్ధంగా పోషకాలుండే కొబ్బరి నీళ్లను తాగేయండి. ఈ నీళ్లు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందాన్ని కూడా పెంచుతాయట
TV9 Telugu
ఇందులో చక్కెర శాతం తక్కువ .దీంతో మధుమేహం ఉన్నవారు కూడా ఈ నీళ్లను తాగొచ్చు. బరువు తగ్గించడంలో తోడ్పడుతుంది. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారికి కొబ్బరి నీళ్ల వల్ల నొప్పి ఎక్కువ కాకుండా ఉంటుంది
TV9 Telugu
వేసవికి ఇది అత్యంత హైడ్రేటింగ్ డ్రింక్. రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి పుష్కలంగా ప్రోటీన్లు, విటమిన్లు లభిస్తాయి. ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది
TV9 Telugu
అయితే గ్లాసు కొబ్బరి నీళ్ళలో నిమ్మకాయ రసం కలిపి తాగడం వల్ల ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ కలిపి తీసుకోవడం వల్ల బరువు వేగంగా తగ్గుతుందట. ఇది కొవ్వును వేగంగా కరిగించి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ కలిపి తాగితే అధిక రక్తపోటు రోగులకు బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. ఇది మూత్రపిండాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది
TV9 Telugu
బ్లడ్ షుగర్ ని నియంత్రించడానికి, ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు, నిమ్మరసం కలిపి తాగడం మంచిది. దాని గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది