AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Periods Leave: అమ్మాయిలు గుడ్‌న్యూస్‌.. పీరియడ్స్ లీవ్స్‌ ప్రకటించిన ప్రభుత్వం.. వెంటనే అమల్లోకి..

దీనికి సంబంధించి గత వారంలోనే సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది . భారతదేశం అంతటా మహిళా విద్యార్థినులు, శ్రామిక మహిళలకు పీరియడ్ లీవ్‌లను ప్రవేశపెట్టాలనే డిమాండ్ ఉంది.

Periods Leave: అమ్మాయిలు గుడ్‌న్యూస్‌..  పీరియడ్స్ లీవ్స్‌ ప్రకటించిన ప్రభుత్వం.. వెంటనే అమల్లోకి..
Students
Jyothi Gadda
|

Updated on: Jan 21, 2023 | 3:18 PM

Share

ఉన్నత విద్యాశాఖ పరిధిలోని అన్ని యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు కల్పిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం జనవరి16న ప్రకటించింది. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారు కేరళ సీఎం పినరయి విజయన్ . కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT) విద్యార్థులకు రుతుక్రమ సెలవులు అందించాలని కోరుతూ , డిపార్ట్‌మెంట్ పరిధిలోని అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో దీనిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు తెలిపారు. దీని గురించి ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘రుతుస్రావం సమయంలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న మానసిక, శారీరక సమస్యలను పరిగణనలోకి తీసుకుని అన్ని యూనివర్సిటీల్లో రుతుక్రమ సెలవులు అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. కొచ్చిన్ యూనివర్శిటీ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ.. కేరళలో తొలిసారిగా ఓ విద్యా కేంద్రం విద్యార్థులకు రుతుక్రమ సెలవులు ఇచ్చిందని తెలిపారు.

ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం పురుషులకు 75% హాజరు ఉండగా విద్యార్థినులకు 73%కి తగ్గించారు. 18 ఏళ్లు పైబడిన విద్యార్థినులందరూ 60 రోజుల ప్రెగ్నెన్సీ లీవ్‌ను పొందవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం పినరయి విజయన్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘రుతుస్రావం సెలవుల నిర్ణయంతో కేరళ మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం, ఈ నిర్ణయం లింగ న్యాయమైన సమాజాన్ని సాధించాలనే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.

దీనికి సంబంధించి గత వారంలోనే సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది . భారతదేశం అంతటా మహిళా విద్యార్థినులు, శ్రామిక మహిళలకు పీరియడ్ లీవ్‌లను ప్రవేశపెట్టాలనే డిమాండ్ ఉంది. కేరళ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు యూనివర్శిటీలో పీహెచ్‌డీ చదువుతున్న వారితో సహా అందరు మహిళా విద్యార్థులకూ వర్తిస్తుంది. తక్షణమే అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…