Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Draw: నక్క తోక తొక్కడం అంటే ఇదేనేమో..! రూ. 100తో లాటరీ టికెట్ కొని.. ఏకంగా రూ. 45 కోట్లు జాక్‌పాట్ కొట్టేశాడు..

సాధారణంగా మన దేశంలో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. వీటిలో కొన్ని లక్షల్లో ఉంటే.. మరి కొన్ని కోట్లలో ఉంటాయి. ఇలాంటి పరిణామం గల్ఫ్ దేశాలతో పాటూ అమెరికాలో కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం కేరళకు చెందిన 39 ఏళ్ల శ్రీజు బుధవారం జరిగి మహ్జూజ్ సాటర్డే మిలియన్స్ డ్రాలో రూ. 45కోట్లు గెలుచుకున్నారు. దీంతో అతని జీవితం స్థిరపడిపోయినట్లు సంబరపడి ఆశ్చర్యానికి లోనైయ్యారు.

Lucky Draw: నక్క తోక తొక్కడం అంటే ఇదేనేమో..! రూ. 100తో లాటరీ టికెట్ కొని.. ఏకంగా రూ. 45 కోట్లు జాక్‌పాట్ కొట్టేశాడు..
Kerala Man Sreeju, Wins Whopping Rs 45 Crore In Weekly Lucky Draw In Uae
Follow us
Srikar T

|

Updated on: Nov 17, 2023 | 8:10 AM

సాధారణంగా మన దేశంలో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. వీటిలో కొన్ని లక్షల్లో ఉంటే.. మరి కొన్ని కోట్లలో ఉంటాయి. ఇలాంటి పరిణామం గల్ఫ్ దేశాలతో పాటూ అమెరికాలో కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం కేరళకు చెందిన 39 ఏళ్ల శ్రీజు బుధవారం జరిగి మహ్జూజ్ సాటర్డే మిలియన్స్ డ్రాలో రూ. 45కోట్లు గెలుచుకున్నారు. దీంతో అతని జీవితం స్థిరపడిపోయినట్లు సంబరపడి ఆశ్చర్యానికి లోనైయ్యారు. గత 11ఏళ్లుగా అరబ్ దేశాల్లో పనిచేస్తున్న అతను కేరళలో ఒక చిన్నపాటి ఇళ్లు కూడా నిర్మించుకోలేదు. ఇక ఈ విజయం వరించిన తరువాత అతని మాటలు వింటే చాలా సామాన్యమైన కుటుంబానికి చెందిన వ్యక్తి అనిపిస్తుంది.

ఆయన ఏమన్నాడంటే.. ‘నేను నా కార్లో తిరుగుతున్నాను. ఒకసారి లాటరీ సంస్థకు చెందిన మహ్జూద్ ఖాతాను చెక్ చేసుకున్నప్పుడు నా కళ్లను నేనే నమ్మలేకపోయానన్నారు. ఈ గెలుపు నిజం అని మహ్జూజ్ నుంచి కన్ఫర్మేషన్ కాల్ రావడంతో ఈ అద్భుతమైన విజయాన్ని చూసి అయోమయంలో పడ్డానని పేర్కొన్నారు’. ఇలాంటి అరుదైన అదృష్టాన్ని గతంలో చాలా మంది భారతీయులు యూఏఈ లక్కీ డ్రాలో పెద్ద పెద్ద విజయాలు సాధించారు. తాజాగా ముంబైకి చెందిన మనోజ్ భావ్‌సర్ అనే వ్యక్తి కూడా ఈ లక్కీ డ్రాలో విజయం సాధించారు. ఇతను అబుదాబిలో 16ఏళ్లుగా ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇతను FAST5 రాఫిల్ అనే లాటరీలో సుమారు రూ. 16లక్షలు గెలుచుకున్నారు. అక్కడి కరెన్సీ ప్రకారం 75వేల దిర్హాంగా చెప్పుకొచ్చారు. ఈ లాటరీలో గెలిచిన డబ్బుల ద్వారా తన అప్పులను తీర్చుకోగలిగానన్నారు.

ఇలా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే లాటరీలను కొనుగోలు చేసే వారిలో మన భారతీయులే అధికంగా ఉంటారు. గత కొన్ని వారాల క్రితం దుబాయ్‌లో జరిగి డ్యూటీ-ఫ్రీ మిలినియం మిలినియర్ డ్రాలో భారత దేశానికి చెందిన మహిళ యూఎస్‌డి 1 మిలియన్ సాధించారు. ఈ లాటరీ టికెట్లు కొనుగోలు చేయాలంటే అధిక ధరలు వెచ్చించాల్సి ఉంటుంది. తమ సంపాదనలో కొంత డబ్బులు పోగుజేసుకొని అప్పుడప్పుడూ కొంటూ ఉంటారు. ఇలా కొనడం ద్వారా అదృష్టం వరించి కొందరు కోట్లకు అధిపతులు అవుతూ ఉంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ డైట్‌ లో ఇవి ఉంటే పెళ్లి తర్వాత బరువు పెరగరు..!
మీ డైట్‌ లో ఇవి ఉంటే పెళ్లి తర్వాత బరువు పెరగరు..!
శని దోషానికి రాహువు అడ్డుకట్ట.. వారి జీవితం నల్లేరు మీద బండి నడకే
శని దోషానికి రాహువు అడ్డుకట్ట.. వారి జీవితం నల్లేరు మీద బండి నడకే
జ్వరం తగ్గాలని.. చిన్నారులకు అగర్‌బత్తితో వాతలు పెట్టి పెట్టి..
జ్వరం తగ్గాలని.. చిన్నారులకు అగర్‌బత్తితో వాతలు పెట్టి పెట్టి..
తండ్రిని చూసేందుకు వచ్చి, అనుమానాస్పద మృతి!
తండ్రిని చూసేందుకు వచ్చి, అనుమానాస్పద మృతి!
మహిళకు పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు..130 రోజుల తర్వాత ఏమైందంటే..
మహిళకు పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు..130 రోజుల తర్వాత ఏమైందంటే..
మీకు పీఎం కిసాన్‌ డబ్బులు రావడం లేదా? కారణాలు ఏంటో తెలుసా?
మీకు పీఎం కిసాన్‌ డబ్బులు రావడం లేదా? కారణాలు ఏంటో తెలుసా?
Viral Video: ఆ డెలివరీ వ్యాన్‌కు దెయ్యం పట్టినట్టుందిగా...
Viral Video: ఆ డెలివరీ వ్యాన్‌కు దెయ్యం పట్టినట్టుందిగా...
వామ్మో.. పగబట్టినట్టు పెళ్లి బృందంపై కందిరీగల దాడి .. వరుడు సహా
వామ్మో.. పగబట్టినట్టు పెళ్లి బృందంపై కందిరీగల దాడి .. వరుడు సహా
అమెరికాను దాటేసిన భారతీయ రైల్వే.. ఆ విషయంలో మనమే కింగ్..!
అమెరికాను దాటేసిన భారతీయ రైల్వే.. ఆ విషయంలో మనమే కింగ్..!
మొబైల్‌లో నెట్‌వర్క్‌ సరిగ్గా రావడం లేదా..? ఇలా చేయండి!
మొబైల్‌లో నెట్‌వర్క్‌ సరిగ్గా రావడం లేదా..? ఇలా చేయండి!