AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Recruitment 2023: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 8,773 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. డిగ్రీ అర్హత

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) భారీగా క్లర్క్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో మొత్తం 8,773 జూనియర్‌ అసోసియేట్స్‌ (క్లరికల్‌ కేడర్‌) పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో 575 పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌ సర్కిల్‌ (తెలంగాణ) సర్కిల్‌లో 525 పోస్టులు, అమరావతి సర్కిల్‌లో 50 జూనియర్‌ అసోసియేట్స్‌ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టులు..

SBI Recruitment 2023: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 8,773 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. డిగ్రీ అర్హత
SBI Recruitment 2023
Srilakshmi C
|

Updated on: Nov 16, 2023 | 9:05 PM

Share

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) భారీగా క్లర్క్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో మొత్తం 8,773 జూనియర్‌ అసోసియేట్స్‌ (క్లరికల్‌ కేడర్‌) పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో 575 పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌ సర్కిల్‌ (తెలంగాణ) సర్కిల్‌లో 525 పోస్టులు, అమరావతి సర్కిల్‌లో 50 జూనియర్‌ అసోసియేట్స్‌ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 17, 2023 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్‌ 7వ తేదీని దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే విభాగంలో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనల్‌/ చివరి సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు ఏప్రిల్‌ 01, 2023 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఏప్రిల్‌ 2, 1995 నుంచి ఏప్రిల్ 1, 2003 మధ్య జన్మించి ఉండాలన్నమాట. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌ రాత పరీక్షలు), స్థానిక భాష నైపుణ్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.19,900 చొప్పున జీతంగా చెల్లిస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష విధానం..

ప్రిలిమినరీ మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి 30 ప్రశ్నలు – 30 మార్కులకు, న్యూమరికల్‌ ఎబిలిటీ విభాగం నుంచి 35 ప్రశ్నలు – 35 మార్కులకు, రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు – 35 మార్కులకు పరీక్ష ఉంటుంది. గంట సమయంలో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులను తొలగిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే ప్రధాన పరీక్షకు ఎంపిక అనుమతిస్తారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: నవంబర్‌ 17, 2023.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్‌ 7, 2023.
  • ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జనవరి 2024లో ఉంటుంది.
  • మెయిన్‌ పరీక్ష తేది: ఫిబ్రవరి 2024లో ఉంటుంది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఏం మనిషివి రా.. లావుగా ఉందని భార్యను హతమార్చిన సాఫ్ట్‌వేర్ మైండ్!
ఏం మనిషివి రా.. లావుగా ఉందని భార్యను హతమార్చిన సాఫ్ట్‌వేర్ మైండ్!
వివాదంలో త్రిష..అసలు తప్పెవరిది..?
వివాదంలో త్రిష..అసలు తప్పెవరిది..?
కుల్దీప్‌పై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. ఢిల్లీలో కలకలం
కుల్దీప్‌పై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. ఢిల్లీలో కలకలం
ఇనాక్టివ్ బ్యాంక్ అకౌంట్లోని బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఈ ఒక్క
ఇనాక్టివ్ బ్యాంక్ అకౌంట్లోని బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఈ ఒక్క
ఏపీకి తరగని ఆస్తి.. 1.90 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.52 లక్షల జాబ్
ఏపీకి తరగని ఆస్తి.. 1.90 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.52 లక్షల జాబ్
నాన్న మరణం.. గుండెలు పగిలేలా కన్నీళ్లు పెట్టుకున్న హీరో జీవ..
నాన్న మరణం.. గుండెలు పగిలేలా కన్నీళ్లు పెట్టుకున్న హీరో జీవ..
అమ్మో! ఈ జన్మలో ఇంకోసారి బిగ్‌బాస్ షోకు వెళ్లను: స్టార్ యాంకర్
అమ్మో! ఈ జన్మలో ఇంకోసారి బిగ్‌బాస్ షోకు వెళ్లను: స్టార్ యాంకర్
షాపులో చీరలు కొట్టేసి..మళ్ళీ షాప్‌కే పార్సిల్ పంపిన కిలాడీ లేడీస్
షాపులో చీరలు కొట్టేసి..మళ్ళీ షాప్‌కే పార్సిల్ పంపిన కిలాడీ లేడీస్
పెళ్లి అయినా మారని అలవాటు.. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిల్లో ఇదే..
పెళ్లి అయినా మారని అలవాటు.. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిల్లో ఇదే..
కోలీవుడ్ సమ్మె.. టాలీవుడ్‌లో వస్తే పరిస్థితేంటి..?
కోలీవుడ్ సమ్మె.. టాలీవుడ్‌లో వస్తే పరిస్థితేంటి..?