కొండచరియల విధ్వంసంతో వయనాడ్ విలవిల.. రంగంలోకి దిగిన ఆర్మీ .. 42 మంది మృతి.. భీకర దృశ్యాలు చూశారా..

|

Jul 30, 2024 | 11:41 AM

కేరళలో భారీవర్షాల బీభత్సం ఎలా ఉందో చూపే దృశ్యమిది. భీకర వర్షాలకు రైల్వేట్రాక్స్‌ దెబ్బతింటున్నాయి. వలతోల్‌ నగర్‌, వడకంచెరి మధ్య ఒక రైల్వేలైన్‌మీదకు వరద పోటెత్తింది. దీంతో స్టేషన్‌ వాచ్‌మన్‌ రైలును ఆపేశాడు. సహాయక చర్యల కోసం ఎయిర్‌ఫోర్స్‌ రంగంలోకి దిగింది. రెండు హెలికాప్టర్లు సహాయకచర్యలకు బయల్దేరాయి. మరోవైపు కేరళ CM పినరయ్‌ విజయన్‌ సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారు.

కొండచరియల విధ్వంసంతో వయనాడ్ విలవిల.. రంగంలోకి దిగిన ఆర్మీ .. 42 మంది మృతి.. భీకర దృశ్యాలు చూశారా..
Kerala Landslide
Follow us on

గాడ్స్‌ ఓన్‌ కంట్రీ అని చెప్పుకునే కేరళ విలపిస్తోంది. ఈ రాష్ట్రంపై ప్రకృతి మళ్లీ పగబట్టింది. భారీ వర్షాలకు జరిగిన విపత్తు, కేరళను ఘోరంగా దెబ్బతీసింది. భారీవర్షాలకు కొండచరియలు విరిగిపడిన దారుణఘటనలో మృతులసంఖ్య పెరుగుతోంది. ఇప్పటిదాకా 24 మంది చనిపోయారు. గాయపడిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. చురల్‌మలా గ్రామం పూర్తిగా ధ్వంసమైంది. కొండచరియల్లో 400 మంది కుటుంబాలు చిక్కుకున్నాయి. ఘటనాస్థలికి వెళ్లే రోడ్డు మార్గాలు ధ్వంసం అయ్యాయి. వరదలో మృతదేహాలు కొట్టుకువస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వయనాడ్‌ లోయ ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ అయింది.

కేరళలో భారీవర్షాల బీభత్సం ఎలా ఉందో చూపే దృశ్యమిది. భీకర వర్షాలకు రైల్వేట్రాక్స్‌ దెబ్బతింటున్నాయి. వలతోల్‌ నగర్‌, వడకంచెరి మధ్య ఒక రైల్వేలైన్‌మీదకు వరద పోటెత్తింది. దీంతో స్టేషన్‌ వాచ్‌మన్‌ రైలును ఆపేశాడు. సహాయక చర్యల కోసం ఎయిర్‌ఫోర్స్‌ రంగంలోకి దిగింది. రెండు హెలికాప్టర్లు సహాయకచర్యలకు బయల్దేరాయి. మరోవైపు కేరళ CM పినరయ్‌ విజయన్‌ సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు ఈ దారుణ ఘటనలో వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (KSDMA) బాధిత ప్రాంతంలో ఫైర్ ఫోర్స్ , NDRF బృందాలను మోహరించినట్లు తెలిపింది. అలాగే ఎన్డీఆర్ఎఫ్ మరో బృందం వాయనాడ్ చేరుకుంది. సైన్యం కూడా బాధ్యతలు చేపట్టింది. సహాయక చర్యలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే కేరళ మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ, “మేము ప్రజలను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. వివిధ ఆసుపత్రుల్లో 24 మృతదేహాలు లభ్యమయ్యాయి. దాదాపు 70 మంది కూడా గాయపడ్డారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందేలా చేశాం. NDRF, పౌర రక్షణ బృందాలు అక్కడ ఉన్నాయి.. త్వరలో నేవీ బృందం కూడా అక్కడికి చేరుకుంటుంది. ఆ ప్రాంతంలో ఒక వంతెన కూడా కొట్టుకుపోయిందని చెప్పారు.

కేరళలోని వాయనాడ్‌లోని మెప్పడి పంచాయతీలో కొండచరియలు విరిగిపడటంతో భారీ నష్టం వాటిల్లిందని భారత సైన్యం వెల్లడించింది. వందలాది మంది చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. పౌర అధికారానికి సహాయం అందించమంటూ అభ్యర్థనను అందుకున్న సైన్యం.. ప్రతిస్పందనగా 122 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ (టెరిటోరియల్ ఆర్మీ) రెండు బృందాలు, కన్నూర్‌లోని డిఎస్‌సి సెంటర్ నుండి రెండు కంటెంజెంట్లు సహా నాలుగు బృందాలను సమీకరించింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇప్పటివరకు మోహరించిన మొత్తం దళాల సంఖ్య 225, ఇందులో వైద్య సిబ్బంది కూడా ఉన్నారు.

కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ వాయనాడ్ కొండచరియలు విరిగిపడిన దృష్ట్యా ఆరోగ్య శాఖ జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌ను తెరిచి, అత్యవసర ఆరోగ్య సేవల కోసం రెండు హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసినట్లు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..