Arvind Kejriwal: ఎరక్కపోయి ఇరుక్కుపోతున్న కేజ్రీ.. మోదీని తక్కువ చేయబోయి బుక్కవుతున్న వైనం

సమాచార హక్కు చట్టం కింద ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలను కోరినందుకు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టు రూ.25,000 జరిమానా విధించింది. ఓ రాష్ట్ర సీఎం హైకోర్ట్ నుంచి జరిమానాకు గురికావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

Arvind Kejriwal: ఎరక్కపోయి ఇరుక్కుపోతున్న కేజ్రీ.. మోదీని తక్కువ చేయబోయి బుక్కవుతున్న వైనం
Arvind Kejriwal
Follow us
Venkata Chari

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 01, 2023 | 5:12 PM

సమాచార హక్కు చట్టం కింద ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలను కోరినందుకు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టు రూ.25,000 జరిమానా విధించింది. ఓ రాష్ట్ర సీఎం హైకోర్ట్ నుంచి జరిమానాకు గురికావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టు సరైన రీతిలో తిక్క కుదిర్చిందని బీజేపీ నేతలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. గతంలోనూ అర్వింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర సర్కారుపై గందరగోళ ప్రకటనలు చేసి నవ్వులపాలయ్యారు. పలు సందర్భాల్లో అర్వింద్ కేజ్రీవాల్ ఇలా మోదీని టార్గెట్ చూస్తూ తన వ్యక్తిగత ఇమేజ్‌ను తగ్గించుకున్నారని సోషల్ మీడియా వేదికగా మోదీ మద్ధతుదారులు ఎద్దేవా చేస్తున్నారు.

ఆ సందర్భాలు ఏంటో ఓసారి చూద్దాం..

ఇవి కూడా చదవండి

అర్వింద్ కేజ్రీవాల్‌..

మురికి కాలువల ద్వారా వెలువడే గ్యాస్‌‌ను ఉపయోగించి టీ చేసుకోవచ్చు ఈ ఎనర్జీని పలు రకాలుగా ఉపయోగించవచ్చు అన్నారు.. అన్నీ తెలిసిన వాళ్లు, చదువుకున్న వాళ్ళు ఇలాంటి మాటలు చెప్పరు ..

ఫ్యాక్ట్..

ఢిల్లీ ఘజియాబాద్ సహీదాబాద్‌లోని రాము అనే యువకుడు కాల్వ ద్వారా వెలువడే గ్యాస్‌తోనే టీ తయారు చేస్తున్నాడు.. ప్రొయోగానికి మారుపేరు అని ఎన్డీటీవీ కథనంలో వివరించింది. ఇంద్రప్రస్తు ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి తన పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ గ్యాస్ తయారీని వివరించాడని పేర్కొంది..

అర్వింద్ కేజ్రీవాల్‌..

ఓ ప్రసంగంలో మాట్లాడుతూ ఎలాంటి వాతావారణ మార్పులు లేవంటూ చెప్పుకొచ్చారు. వాతావారణ మార్పులు, గ్లోబల్ క్లెయిమట్ చేంజ్.. గ్లోబల్ వార్మింగ్‌ అనేది అందరికి తెలిసిన నిజం. ప్రపంచం మొత్తం దీనిని నమ్ముతుంది.. అంతేగాక దీనిపై చర్యలు కూడా చేపట్టింది..

ఫ్యాక్ట్.. మోడీ..

వాతావరణం మారలేదు.. మనము మారిపోయాము.. మనతోపాటు మన అలవాట్లు మారిపోయాయి. మనమ్ మారితే.. పర్యావరణం కూడా మారిపోతుంది. ముఖ్యంగా మనుషులు ప్రకృతి తో పెట్టుకోవద్దు.. మనమంతా ప్రక్రుతిని ప్రేమించాలి..

అర్వింద్ కేజ్రీవాల్‌..

వర్షాలు పడినప్పుడు, ఆకాశం మేఘా వ్రుత్తమైనప్పుడు.. వాటి వెనుకనుంచి వెళ్లే విమానాలను రాడార్ వ్యవస్థ గుర్తించలేదంటూ ఆయన ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇది విన్న వారంతా ఆయన ఎం మాట్లాడుతున్నారన్నారు.. ఆర్మీ.. చదువుకున్న వారు.. యువకులు.. పిల్లలు విని షాక్ అయ్యారు.

ఫ్యాక్ట్..

ఎయిర్ మార్షల్ రఘునాద్ నంబీయార్ మాట్లాడుతూ.. ఎక్కువగా మేఘాల వల్ల ఒక్కోసారి రాడార్ వ్యవస్థ పనిచేయడం లేదంటూ పేర్కొన్నారు.

వీటిని బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ.. అరవింద్ కేజ్రీవాల్‌ నవ్వులపాలయ్యారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు మేధావి ముసుగులో కేజ్రీవాల్ పదేపదే బాధ్యతారహితమైన అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బీజేపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. ఈ పద్ధతిని ఇకనైనా ఆయన మానుకోవాలని హితవుపలుకుతున్నారు. వ్యక్తిగత విమర్శలను మానుకుని, ఢిల్లీలో పాలనపై దృష్టిసారిస్తే మంచిదని సూచిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..