ప్లీజ్ మోదీజీ..! దయచేసి నా మాట కూడా వినండి.. ప్రధానికి చిన్నారి విజ్ఞప్తి

అలా స్కూల్ మొత్తాన్ని చూపిస్తూ.. ప్లీజ్ మోదీజీ.. స్కూల్‌లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని విజ్ఞ‌ప్తి చేసింది. ఆ తర్వాత అక్కడ్నుంచి కిందకు దిగింది.. కాంపౌండ్ వాల్ వద్దకు వెళ్లింది.. అక్కడ విద్యార్థుల కోసం కేటాయించిన టాయ్‌లెట్‌‌ను చూపించింది. అది మరింత అధ్వాన్నంగా ఉంది.

ప్లీజ్ మోదీజీ..! దయచేసి నా మాట కూడా వినండి.. ప్రధానికి చిన్నారి విజ్ఞప్తి
School Girl Request To Pm
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 15, 2023 | 4:53 PM

దేశంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు అధ్వాన్నంగా మారింది. కార్పొరేట్‌ కాసుల చదువు ముందర సర్కార్‌ బడులు నిలదొక్కుకోలేకపోతున్నాయి. ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా సరైన వసతులు, సౌకర్యాలు లేక ప్రభుత్వ బడులు మూతపడే దుస్థితి ఏర్పాడుతోంది. అయితే సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇప్పుడు విద్యార్థులు ఈ ప్రభుత్వ బడులకు దూరం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఓ చిన్నారి ప్రధాని మోదీకి చేసిన విన్నపం నెట్టింట వైరల్‌ అవుతోంది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఓ చిన్నారి తన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని పునరుద్ధరించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ చేసిన అభ్యర్థన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 5 నిమిషాల నిడివి గల వీడియోలో చిన్నారి తనను తాను పరిచయం చేసుకుంటూ తమ స్కూల్‌ దుస్థితిని కళ్లకు కట్టినట్టుగా చూపించింది. ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారిన వీడియోకి 2 మిలియన్లకుపైగా వ్యూస్‌, దాదాపు 1.20 లక్షలకు పైగా కామెంట్స్‌ వచ్చాయి.

జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లా లొహయ్-మల్హర్ గ్రామానికి చెందిన సీరత్ నాజ్‌గా అనే చిన్నారి ముందుగా తనను తాను పరిచయం చేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్టు తెలిపింది. ఆ తర్వాత తన పాఠశాల గురించి ఒక్కొక్కటిగా వీడియోలో చెప్పడం ప్రారంభించింది. అక్కడి స్కూల్‌ పరిస్థితి ఎంతటి అధ్వానంగా ఉందో ఆ బాలిక వివరించింది. ‘మోదీజీ ఇది మా స్కూల్’ అంటూ ముందుగా మెట్లను చూపించింది.. అవి రాళ్లతో, చెత్తతో ప్రమాదంగా ఉన్నాయి. అనంతరం కాంపౌండ్‌లోకి వెళ్లిన మూసి ఉన్న గదులను చూపించి..‘ప్రిన్సిపాల్ ఆఫీస్, స్టాఫ్ రూమ్’అంటూ చెప్పుకొచ్చింది. ఫ్లోర్లింగ్ ఎంత మురికిగా ఉందో చూడండి.. దీనిపైనే మమ్మల్ని కూర్చోబెడతారు అంటూ తరగతి గదులను చూపించింది.

ఇదే మా స్కూల్ బిల్డింగ్‌.. స్కూల్లోని ప్రతి మూలను మీకు చూపిస్తాను అంటూ వీడియో తీసుకుంటూ ముందుకు వెళ్లింది. గత ఐదేళ్లుగా భవనం ఎంత అపరిశుభ్రంగా ఉందో చూడండని ముందుకు వెళ్లింది.‘ నేను మిమ్మల్ని భవనం లోపలికి తీసుకెళ్తాను.. మా కోసం మంచి స్కూల్ కట్టాలని ప్రాధేపడుతున్నాను.. ఇంతటి చెత్తాచెదారంతో మురికిగా ఉన్న ఫ్లోర్‌పై కూర్చోవటం వల్ల మా  యూనిఫామ్స్ మాసిపోతున్నాయి. యూనిఫారాలు మురికిగా ఉన్నాయని మా అమ్మలు తరచూ మమ్మల్ని తిడుతున్నారు. మాకు కూర్చోవడానికి బెంచీలు లేవు’ అని చెప్పింది. అలా స్కూల్ మొత్తాన్ని చూపిస్తూ.. ప్లీజ్ మోదీజీ.. స్కూల్‌లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని విజ్ఞ‌ప్తి చేసింది. ఆ తర్వాత అక్కడ్నుంచి కిందకు దిగింది.. కాంపౌండ్ వాల్ వద్దకు వెళ్లింది.. అక్కడ విద్యార్థుల కోసం కేటాయించిన టాయ్‌లెట్‌‌ను చూపించింది. అది మరింత అధ్వాన్నంగా ఉంది.

ఇవి కూడా చదవండి

‘మోదీజీ మీరు దేశం మొత్తం చెప్పేది వినండి.. దయచేసి నా మాట కూడా వినండి.. మాకు మంచి పాఠశాలను నిర్మించండి.. నేలపై కూర్చోవాల్సిన అవసరం లేని విధంగా పాఠశాల ఉండాలి. నా యూనిఫాం మురికిగా ఉందని మా అమ్మ నన్ను తిట్టదు. అలాగైతేనే మేమంతా బాగా చదువుకుంటాం. దయచేసి మా కోసం ఒక చక్కని పాఠశాలను నిర్మించండి’ అని వీడియోను ముగించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తీవ్రంగా స్పందిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!