AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవిత్ర చార్ ధామ్ అనంతరం మరో యాత్ర ప్రారంభం.. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశం.. ఏర్పాట్లలో భారత సైన్యం..

చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 22న అంటే అక్షయ తృతీయ రోజున ప్రారంభమవుతుంది. యమునోత్రి, గంగోత్రి ఆలయాల తలుపులు ఏప్రిల్ 22న తెరుస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 25న కేదార్‌నాథ్ తలుపులు తెరవబడతాయి. అదే సమయంలో ఏప్రిల్ 27 న బద్రీనాథ్ ధామ్ తలుపులు కూడా తెరుస్తారు.

పవిత్ర చార్ ధామ్ అనంతరం మరో యాత్ర ప్రారంభం.. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశం.. ఏర్పాట్లలో భారత సైన్యం..
Shri Hemkund Sahib
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 15, 2023 | 1:34 PM

హేమకుండ్ సాహిబ్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న హేమకుండ్ సాహిబ్ గురుద్వారా పోర్టల్‌లు మే 20 నుండి భక్తుల దర్శనార్థం తెరుస్తారు. ఉత్తరాఖండ్‌లోని గురుద్వారా శ్రీ హేమకుండ్ సాహిబ్ ప్రారంభోత్సవానికి ముందు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అదే రోజున లోక్‌పాల్ లక్ష్మణ్ ఆలయ తలుపులు కూడా తెరుచుకుంటాయి. హేమకుండ్ సాహిబ్ యాత్రా మార్గంలో పేరుకుపోయిన మంచును తొలగించే పనిలో నిమగ్నమైంది భారత సైన్యం. ఏప్రిల్ 20 నుంచి యాత్ర ప్రారంభమవుతుందని హేమకుండ్ సాహిబ్ మేనేజ్‌మెంట్ ట్రస్ట్ చైర్మన్ సర్దార్ నరేంద్రజిత్ సింగ్ బింద్రా తెలిపారు. చమోలి జిల్లాలో హేముకంద్ సాహిబ్ గురుద్వారా 15200 అడుగుల ఎత్తులో ఉంటుంది. హేమకుండ్ సాహిబ్ సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ తపస్సు చేసిన స్థలంగా చెబుతారు.

గురుద్వారా హేమ్‌కుండ్ సాహిబ్ సిక్కులకు పవిత్ర స్థలం. ప్రతిరోజూ ఇక్కడికి సుమారు 5000 మంది సందర్శకులు దీనిని సందర్శిస్తారు. దీని కోసం రోడ్డు మార్గంలో గోవింద్ ఘాట్ వరకు ప్రయాణించాలి. ఆ తర్వాత కాలినడకన లేదా గుర్రాల ద్వారా గోవింద్ ధామ్ వద్ద రాత్రిపూట ఆగాల్సి ఉంటుంది. ప్రతికూల వాతావరణం, కొండచరియలు విరిగిపడటం, ఎత్తైన కొండలపైకి నిటారుగా ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది.

హేమకుండ్ సాహిబ్ ప్రయాణం గోవింద్ ఘాట్ నుండి ప్రారంభమవుతుంది. యాత్రలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్ర ప్రధాన గమ్యం అయిన గోవింద్‌ఘాట్‌ వద్ద ఆరోగ్య శాఖ బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే సిక్కు కమ్యూనిటీకి చెందిన భక్తులు ఇక్కడి నుండి హేమకుండ్ సాహిబ్ ధామ్‌కు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు.

చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 22న అంటే అక్షయ తృతీయ రోజున ప్రారంభమవుతుంది. యమునోత్రి, గంగోత్రి ఆలయాల తలుపులు ఏప్రిల్ 22న తెరుస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 25న కేదార్‌నాథ్ తలుపులు తెరవబడతాయి. అదే సమయంలో ఏప్రిల్ 27 న బద్రీనాథ్ ధామ్ తలుపులు కూడా తెరుస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం..