School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నవంబర్ 5,6 తేదీల్లో పాఠశాలలు బంద్!
School Holidays: ఈ సందర్భంగా నవంబర్ 5న తెలంగాణలో అయితే అధికారిక సెలవు ఉంది. ఈ మేరకు ప్రభుత్వ హాలిడే క్యాలెండర్ లో సెలవు దినంగా పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమితో పాటు సిక్కుల మతగురువు గురునానక్ జయంతి కూడా నవంబర్ 5నే..

School Holidays: భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో బుధవారం నవంబర్ 5, 2025న పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. నవంబర్ 5న గురునానక్ జయంతి, ప్రభుత్వ సెలవుదినం. దీని కోసం ప్రభుత్వం గెజిటెడ్ సెలవు ప్రకటించింది. అయితే కార్తీక పౌర్ణమి హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఈ పర్వదినాన ప్రజలు వేడుకలు జరుపుకుంటారు. ఈ పండగ సందర్భంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవుపై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. సెలవు ఉంటుందని కొందరు, లేదని మరికొందరు ప్రచారం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bank Holiday: నవంబర్ 5న ఈ నగరాల్లో బ్యాంకులు బంద్.. ఎందుకో తెలుసా?
తెలంగాణలో అధికారిక సెలవు:
అయితే కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 5న తెలంగాణలో అయితే అధికారిక సెలవు ఉంది. ఈ మేరకు ప్రభుత్వ హాలిడే క్యాలెండర్ లో సెలవు దినంగా పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమితో పాటు సిక్కుల మతగురువు గురునానక్ జయంతి కూడా నవంబర్ 5నే. ఇలా హిందువులు, సిక్కులకు ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి రేపు (బుధవారం) పూర్తిస్థాయిలో సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
ఏపీలో సెలవు ఉంటుందా?
కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు లేదు. కానీ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే మాత్రం ఇచ్చారు. కావాలనుకుంటే మాత్రమే నవంబర్ 5న ఉద్యోగులు సెలవు తీసుకోవచ్చు. తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు బుధవారం సెలవు ముగుస్తుందో లేదో మరో రెండ్రోజుల సెలవులు ఉంటాయి. నవంబర్ 6, 7 (గురు, శుక్రవారం) రెండ్రోజులు మాత్రమే స్కూళ్లు నడిచేది. తర్వాత నవంబర్ 8,9 (శని, ఆదివారం) రెండ్రోజులు సెలవులు రానున్నాయి. దీంతో వరుస సెలవులతో విద్యార్థులు ఎంజాయ్ చేయవచ్చు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌తో సహా అనేక రాష్ట్రాల్లో సెలవులు ప్రకటించబడ్డాయి. నవంబర్ 5న మీ రాష్ట్రంలో పాఠశాలలు మూసివేయబడతాయో లేదో తెలుసుకోండి.
ఇది కూడా చదవండి: PAN Card: డిసెంబర్ వరకే గడువు.. ఈ పని చేయకుంటే మీ పాన్ కార్డు డీయాక్టివేట్!
గురునానక్ జయంతి ఎక్కడ సెలవుదినం?
ఢిల్లీ NCR, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలలోని పాఠశాలలు నవంబర్ 5న మూసివేయబడతాయి.
నవంబర్ 6 పాఠశాలలకు ఎందుకు సెలవు?
గంగా స్నానాన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాలు నవంబర్ 6వ తేదీని సెలవు దినంగా ప్రకటించాయి. ఇంతలో బీహార్ 2025 బీహార్ ఎన్నికలకు నవంబర్ 6వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మూసివేయబడతాయి. ఇంకా ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ నవంబర్ 6వ తేదీన ప్రసిద్ధి చెందిన న్గోమ్ నృత్య ఉత్సవాన్ని జరుపుకుంటోంది. దీనితో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పాఠశాలలు మూసి ఉంటాయి.
ఇది కూడా చదవండి: Ration Card: రేషన్ కార్డుదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే రేషన్ కట్!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








