ఛీ.. నీచుడా.. పురుగులు పట్టి పోతావ్ రా.. భార్యకు మత్తమందు ఇచ్చి ఏం చేశాడంటే..?
మహిళను బ్లాక్‌మెయిలింగ్ చేసే కేసుల్లో నిందితులు ఎక్కువగా బయటి వ్యక్తులు లేదా ప్రేమికులే ఉంటారు. కానీ కట్టుకున్నవాడే బ్లాక్ మెయిల్ చేస్తే.. ఆ మహిళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. భార్యకు మత్తుమందు ఇచ్చి.. భర్త నీచానికి పాల్పడ్డాడు.

భార్యాభర్తల బంధం ఎంతో అన్యోన్యమైంది. జీవితాంతం ఒకరికొకరు తోడునీడగా ఉంటారు. అటువంటి బంధానికే మచ్చే తెచ్చేలా వ్యవహరించాడు ఓ కీచక భర్త. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కట్నం వేధింపులకు తోడు భర్త తన భార్యకు మత్తుమందు ఇచ్చి అశ్లీల వీడియో తీసి, దానిని డిలిట్ చేయడానికి ఏకంగా రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడు. గోరఖ్‌నాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వివాహిత ఏడుస్తూ గోరఖ్‌నాథ్ పోలీసులను ఆశ్రయించింది. “సార్ నాకు సహాయం చేయండి. నా భర్త నా అశ్లీల వీడియో తీశాడు. దాన్ని తొలగించమని అడిగితే, అతను నా నుండి రూ. 10 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు” అని ఆమె పోలీసులకు మొరపెట్టుకుంది.
యువతితో అక్రమం సంబంధం
వివాహం అయినప్పటి నుండి తన అత్తమామలు, భర్త కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు తెలిపింది. గతంలో ఈ విషయం పంచాయతీ వరకు వెళ్లి రాజీ కూడా కుదిరింది. సీతాపూర్‌లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న తన భర్తకు అక్కడ పనిచేసే ఒక యువతితో అనైతిక సంబంధం ఉందని మహిళ ఆరోపించింది. తన భర్త ఆ యువతిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడని, అందుకే తనను వేధించడం మొదలుపెట్టాడని ఫిర్యాదులో తెలిపింది.
హద్దులు దాటిన బ్లాక్‌మెయిలింగ్
యువతితో పెళ్లికి భార్య అభ్యంతరం చెప్పడంతో.. భర్త వేధింపులు ఎక్కువయ్యాయి. ఒక రోజు అతను ఆమెకు మత్తుమందు ఇచ్చి.. భార్య నగ్న వీడియోలను చిత్రీకరించాడు. ఆ వీడియోతో భార్యను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని, కుటుంబ పరువు తీస్తానని బెదిరించి, వీడియోను తొలగించడానికి ఆమె నుంచి రూ. 10 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది.
పోలీసుల దర్యాప్తు
తన భర్త, అత్తమామలు గతంలో చాలాసార్లు తనను కొట్టి ఇంటి నుండి వెళ్లగొట్టారని కూడా మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై గోరఖ్‌నాథ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




