Karnataka New CM: ఎల్లుండే కర్నాటక కొత్త సీఎం ప్రమాణం.. ‘డీకే’కి బర్త్‌డే గిఫ్ట్ ఇస్తుందా?!
కర్నాటక హస్తగతమైంది. క్లియర్ మెజారిటీతో సూపర్ విక్టరీ కొట్టింది కాంగ్రెస్. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి సీట్లు సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 సీట్లను ఆల్రెడీ గెలుచుకుంది కాంగ్రెస్. ఇప్పటివరకు 113 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. 20కి పైగా సీట్లలో ఆధిక్యం కొనసాగిస్తోంది. ప్రస్తుతమున్న లెక్కల ప్రకారం టోటల్‌గా కాంగ్రెస్ 137 స్థానాలను..

కర్నాటక హస్తగతమైంది. క్లియర్ మెజారిటీతో సూపర్ విక్టరీ కొట్టింది కాంగ్రెస్. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి సీట్లు సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 సీట్లను ఆల్రెడీ గెలుచుకుంది కాంగ్రెస్. ఇప్పటివరకు 113 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. 20కి పైగా సీట్లలో ఆధిక్యం కొనసాగిస్తోంది. ప్రస్తుతమున్న లెక్కల ప్రకారం టోటల్‌గా కాంగ్రెస్ 137 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
అయితే, కర్నాటకలో సూపర్ విక్టరీ కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతోంది. ఎల్లుండే కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాంతో, కర్నాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చ ఉత్కంఠ రేపుతోంది. కర్నాటక కొత్త సీఎంపై ఊహాగానాలు హల్‌చల్ చేస్తున్నాయ్. సీఎం రేస్‌లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉన్నారు. అయితే, ముందు వరుసలో మాత్రం సిద్ధరామయ్య పేరే వినిపిస్తోంది.
బెంగళూరులో ఆదివారం నాడు సీఎల్పీ సమావేశం జరగనుంది. గెలిచిన ఎమ్మెల్యేలందర్నీ బెంగళూరు రావాలని ఆదేశించింది కాంగ్రెస్ హైకమాండ్. సీఎల్పీ భేటీలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. అయితే, కొత్త సీఎంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే. సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే, సోమవారం నాడు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉండటం, అదే రోజు డీకే శివకుమార్ పుట్టిన రోజు కూడా ఉండటం ఆసక్తి రేపుతోంది. కర్నాటకలో కాంగ్రెస్ గెలుపునకు విశేష కృషి చేసిన డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అధిష్టానం బర్త్‌డే గిఫ్ట్ ఏమిస్తుంది? అనేదానిపై ఆసక్తి నెలకొంది.




కర్నాటక విజయంపై రాహుల్ గాంధీ స్పందన..
కర్నాటకలో కాంగ్రెస్ విజయం చరిత్రాత్మకమైనదన్నారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ. కర్నాటక ప్రజల విజయంగా అభివర్ణించారు. ప్రేమతోనే కన్నడ ప్రజల మనసులు గెలుచుకున్నట్టు చెప్పారు. ఇలాగే, ప్రజలందరి మనసులు గెలుచుకుంటామని చెప్పుకొచ్చారు. కర్నాటకలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు రాహుల్‌గాంధీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




