Extra Marital Affair: ఛీ ఛీ ఇంత దారుణమా.. కజిన్ బ్రదర్‌తో అఫైర్.. కట్టుకున్న భర్త అడ్డొస్తున్నాడని..

భారతీయ సంప్రదాయాలు, హిందూమత విశ్వాసాల ప్రకారం వివాహానికి విశేష ప్రాధాన్యత ఉంది. వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యే జంటలు.. వివాహా బంధాన్ని ఎంతో పవితంగా భావిస్తారు.

Extra Marital Affair: ఛీ ఛీ ఇంత దారుణమా.. కజిన్ బ్రదర్‌తో అఫైర్.. కట్టుకున్న భర్త అడ్డొస్తున్నాడని..
Illicit Affairs
Follow us

|

Updated on: Feb 14, 2023 | 7:58 PM

భారతీయ సంప్రదాయాలు, హిందూమత విశ్వాసాల ప్రకారం వివాహానికి విశేష ప్రాధాన్యత ఉంది. వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యే జంటలు.. వివాహా బంధాన్ని ఎంతో పవితంగా భావిస్తారు. అయితే, ప్రస్తుత కాలంలో కొందరు వ్యవహార శైలి కారణంగా వివాహ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లిపోతుంది. కట్టుకున్న వారిని కాదని, మరో వ్యక్తిపై వ్యామోహంతో కాపురాలను కూల్చేస్తున్నారు. ప్రియుడు, ప్రియురాలిపై మోజులో కట్టుకున్నవారిని సైతం కడతేర్చే స్థాయికి దిగజారిపోతున్నారు. తాజాగా బెంగళూరులో ఇలాంటి దారుణమైన ఘటన సంచలనం రేపుతోంది.

వాయివరుస మరిచిన ఓ వివాహిత.. కజిన్ బ్రదర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని, కట్టుకున్న భర్తనే కడతేర్చింది. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి.. అతన్ని చంపేందుకు రౌడీలకు సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. కర్ణాటకలోని తుముకురు జిల్లా కుణిగల్ తాలూకా సీనప్పనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది.

సభ్య సమాజం చీదరించుకునేలా ఉన్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సీనప్పనహళ్ళి గ్రామానికి చెందిన మంజునాథ్, హర్షిత(20)కి వివాహం జరిగింది. అయితే, హర్షితకు తన పిన్ని కొడుకు రఘుతో అఫైర్ ఉంది. వీరిద్ధరి సంబంధానికి మంజునాథ్ అడ్డుగా ఉన్నాడని భావించి అతని హత్యకు కుట్ర పన్నారు హర్షిత, రఘు. అనుకున్నట్లుగానే.. తన భర్తను హత్య చేసేందుకు ఓ రౌడీ షీటర్‌కు రూ. 5 లక్షలు సుపారీ ఇచ్చింది హర్షిత. మంజునాథ్‌ వెనుక కుట్ర నడుపుతూ వచ్చింది హర్షిత.

ఈ క్రమంలో ఫిబ్రవరి 3వ తేదీన కుణిగల్ పట్టణంలో స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యాడు. ఆ తరువాత స్వగ్రామానికి వచ్చి నిద్రపోయాడు. ఇంతలో అర్థరాత్రి అతనికి ఫోన్ వచ్చింది. దాంతో అతను ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్లిపోయాడు. అలా వెళ్లిన వ్యక్తి మళ్లీ తిరిగి రాలేదు. రెండు రోజులైనా అతని ఆచూకీ దొరక్కపోవడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మంజునాథ్ కోసం తీవ్రంగా గాలించారు. అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సెర్చ్ చేయగా.. ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిత్న మంగళ చెరువులో శవమై కనిపించాడు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మంజునాథ్ మృతదేహాన్ని పోస్టుమార్టం చేసిన అనంతరం.. రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు ముందుగా కుటుంబ సభ్యులను విచారించగా.. మంజునాథ్ భార్య హర్షిత వైఖరి అనుమానాస్పదంగా కనిపించింది. దాంతో ఆమెను పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజాన్ని అంగీకరించింది. భర్తను తానే చంపించినట్లు అంగీకరించింది. ఆమె ఇచ్చిన సమాచారం ప్రకారం.. రఘు, రవికిరణ్‌ లను అరెస్ట్ చేశారు పోలీసులు. హత్య జరిగిన రోజు అర్థరాత్రి రఘు, రవికిరణ్‌లు మంజునాథ్‌కు ఫోన్ చేయించి చెరువు వద్దకు పిలిపించారని, అక్కడికి రాగానే హత్య చేసి చెరువులో పడేసిన్లు విచారణలో అంగీకరించారు నిందితులు. ముగ్గురినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..