Midday Meal: విద్యార్థులకు మధ్యాహ్నం ‘గుడ్డు’ ఎందుకు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీజేపీ నేత..!

|

Aug 02, 2022 | 5:55 PM

Midday Meal: విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో గుడ్లు ఎందుకు ఇవ్వాలి? అని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ నాయకురాలు...

Midday Meal: విద్యార్థులకు మధ్యాహ్నం ‘గుడ్డు’ ఎందుకు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీజేపీ నేత..!
Egg
Follow us on

Midday Meal: విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో గుడ్లు ఎందుకు ఇవ్వాలి? అని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ నాయకురాలు తేజస్విని అనంత్ కుమార్ ప్రశ్నించారు. ఒక్క గుడ్డులోనే పోషకాలు ఉన్నట్లు భావించడం సరికాదన్నారు. స్కూల్ విద్యార్థుల్లో చాలా మంది శాకాహారులు కూడా ఉన్నారని, వారికి గుడ్లు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారామె. ఒక్క గుడ్డులోనే పోషకాలు ఉన్నట్లు.. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ప్రకటించడం సరికాదన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆమె.. అందరికీ సమానమైన విధానాలను రూపొందించాలని డిమాండ్ చేశారు.

ఆమె ట్వీ్ట్ ఇదీ.. ‘‘మన కర్ణాటక ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో గుడ్లు ఇవ్వాలని ఎందుకు నిర్ణయించింది? గుడ్లు మాత్రమే పోషకాహారానికి మూలం కాదు. శాకాహారులైన చాలా మంది విద్యార్థులకు ఇది మినహాయింపు. ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు ఉండేలా మన విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉంది.’’ అని తేజస్విని అనంత్ కుమార్ తన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు ‘పీఎం పోషణ్ శక్తి నిర్మాణ్’ లో భాగంగా మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లు, అరటిపండ్లు లేదా వేరుశెనగ చిక్కీలను చేర్చనున్నట్లు కర్ణాటక పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అన్ని జిల్లాల్లోనూ ఇది అమలు చేయడం జరుగుతుందని స్పష్టం చేసింది ప్రభుత్వం. అయితే, ఏ విద్యార్థినీ గుడ్లు తినమని ఒత్తిడి చేయబోమని విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ స్పష్టం చేశారు. శాకాహారులు చిక్కీలు, అరటిపండ్లను తీసుకోవచ్చని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..