AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: చికెన్ కర్రీ బకెట్‌తో నిరసనకు దిగిన విద్యార్థులు.. డీసీ నిర్ణయంతో రచ్చ రచ్చ..

విద్యార్థులంటే కేవలం పుస్తకాలు చదవడం, పరీక్షలు పెడితే రాయడం, పాస్ అవ్వడం మాత్రమే కాదు.. కళ్లెదుట జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాలి కూడా.

Karnataka: చికెన్ కర్రీ బకెట్‌తో నిరసనకు దిగిన విద్యార్థులు.. డీసీ నిర్ణయంతో రచ్చ రచ్చ..
Chicken Curry
Shiva Prajapati
|

Updated on: Jan 29, 2023 | 4:22 PM

Share

విద్యార్థులంటే కేవలం పుస్తకాలు చదవడం, పరీక్షలు పెడితే రాయడం, పాస్ అవ్వడం మాత్రమే కాదు.. కళ్లెదుట జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాలి కూడా. ఈ విద్యార్థులు కూడా అదే చేశారు. తమకు జరుగుతున్న అన్యాయంపై పోరుబాట పట్టారు. ఏకంగా కలెక్టర్ నివాసం ఎదుట ధర్నాకు దిగారు. ఇంకీ వారికొచ్చిన సమస్య ఏంటి? వారెందుకు పోరుబాట పట్టారు వంటి వివరాలు తెలుసుకుందాం.

తమ హాస్టల్‌లో పదే పదే నాసిరకం భోజనం పెడుతున్నారంటూ కాలేజీ విద్యార్థులు ఒక బకెట్ నిండా కోడి కూరను తీసుకెళ్లి.. బళ్లారి డిప్యూటీ కమిషనర్ భవన్ ఎదుట నిరసనకు దిగారు. అంతకు ముందు ఇదే అంశంపై అనేకసార్లు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దాంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు.. ఇలా కర్రీ బకెట్‌తో నిరసనకు దిగారు. అయితే, ఈ అంశంపై బళ్లారి డిప్యూటీ కమిషనర్ పవన్ కుమార్ మాలపాటి సీరియస్ అయ్యారు. విద్యార్థులు తిరిగి హాస్టళ్లకు వెళ్లిపోవాలని ఆదేశించారు. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో.. నిరసనలో పాల్గొన్న 25 మంది విద్యార్థులను తొలగించాలంటూ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దాంతో వివాదం మరింత ముదిరింది.

డీసీ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఎస్సీ విద్యార్థులను అణచివేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు కర్ణాటక ప్రతిపక్ష నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఈ అంశంపై స్పందించారు. విద్యార్థులకు మద్ధతు ప్రకటించారు. డీసీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..