Karnataka Election 2023: రసవత్తరంగా కర్ణాటక రాజకీయం.. కిచ్చా సుదీప్‌పై ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మే 10న ఎన్నికలు జరగనున్న తరుణంలో కర్ణాటకలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అటు పొలిటికల్.. ఇటు సినీ గ్లామర్.. రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నాయి.

Karnataka Election 2023: రసవత్తరంగా కర్ణాటక రాజకీయం.. కిచ్చా సుదీప్‌పై ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్..
Prakash Raj Kichcha Sudeep

Updated on: Apr 06, 2023 | 1:32 PM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మే 10న ఎన్నికలు జరగనున్న తరుణంలో కర్ణాటకలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అటు పొలిటికల్.. ఇటు సినీ గ్లామర్.. రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నాయి. ఇప్పటికే సౌత్‌లో లీడ్‌లో ఉన్న పెద్ద పెద్ద స్టార్స్‌ను తమవైపు తిప్పుకున్న కమలం.. రాబోయే ఎలక్షన్స్‌లో గ్లామర్ డబుల్‌ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కన్నడ హీరో కిచ్చా సుదీప్, దర్శన్‌లు బీజేపీకి సపోర్ట్ ఇవ్వడంతో పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి. బీజేపీకి కిచ్చా సుదీప్ సపోర్ట్ ఇవ్వడంపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థులకు ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్ మద్దతు ఇవ్వడంపై ప్రకాష్ రాజ్ బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కిచ్చా సుదీప్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. దీనిపై కిచ్చా సుదీప్‌ మాట్లాడుతూ.. మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అధికార బిజెపి పార్టీ ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. అయితే, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఆయన సూచించిన అభ్యర్థులకు మాత్రకమే ప్రచారం చేస్తానని ప్రకటించారు. పార్లీలో చేరబోనంటూ కూడా ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

కిచ్చా సుదీప్‌ చేసిన ప్రకటన పై స్పందించిన ప్రకాష్ రాజ్.. ఈ ప్రకటన చూసి షాకయ్యాను.. బాధపడ్డాను అంటూ.. వార్త సంస్థ ఏఎన్‌ఐతో పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్న ప్రకాష్ రాజ్.. ముందుగా కిచ్చా సుదీప్ బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న మీడియా కథనాలను “ఫేక్ న్యూస్”గా అభివర్ణించారు. కన్నడ స్టార్ హీరో ‘‘కాషాయ పార్టీకి ఎర కాబోరు.. చాలా తెలివైన వారు” అంటూ తెలిపారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిరాశలో ఉన్న బీజేపీ ‘ఫేక్ న్యూస్’ ప్రచారం చేస్తోందంటూ ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

బీజేపీ పార్టీ కోసం కాదు.. సీఎం బొమ్మై కోసం ప్రచారం చేస్తానన్న కిచ్చా సుదీప్.. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై కూడా స్పందించారు. “అతను ఏమి చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పవచ్చు, నేను ఆయన్ను ఒక సినీనటుడిగా గౌరవిస్తాను. నేను అతని చిత్రాల కోసం ఎదురు చూస్తుంటాను” అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

అయితే, తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, రాజకీయాల్లోకి రావడం లేదని సుదీప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తాను ఒక పార్టీకి కూడా మద్దతు ఇవ్వడం లేదన్నారు. ముఖ్యమంత్రి పట్ల తనకున్న ఆప్యాయత, గౌరవాన్ని ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. కష్ట సమయాల్లో ఆయన తనకు అండగా నిలిచారని.. తన కుటుంబంతో చాలా సన్నిహిత బంధాన్ని పంచుకున్నారని గుర్తుచేసుకున్న కిచ్చా సుదీప్.. బొమ్మైకి తన మద్దతును ప్రకటించారు. సీఎం బొమ్మై కోసం ప్రచారం చేస్తానని.. పార్టీ కోసం కాదంటూ క్లారిటీ ఇచ్చారు.

“నా కష్ట సమయాల్లో నాకు అండగా నిలిచినవారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు.. వారిలో ప్రధాన, ప్రియమైన వ్యక్తి బసవరాజ్ బొమ్మై.. ఈ వ్యక్తి పట్ల నేను కలిగి ఉన్న కర్తవ్యం.. కృతజ్ఞత ఇదే” అంటూ కిచ్చా సుదీప్ అన్నారు. బొమ్మైతోపాటు.. ఇంకొంతమందికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను.. అందరి కోసం ప్రచారం చేయలేను.. అంటూ కిచ్చా సుదీప్ క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..