AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిప్యూటీ సీఎం పదవి ఇవ్వమని అమ్మవారిని వేడుకున్న శ్రీరాములు

అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గాదేవిని కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి బి.శ్రీరాములు ఆసక్తికరమైన కోరికను కోరారు. షాహపూర్‌లోని దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించిన ఆయన అమ్మవారి..

డిప్యూటీ సీఎం పదవి ఇవ్వమని అమ్మవారిని వేడుకున్న శ్రీరాములు
Balu
|

Updated on: Sep 19, 2020 | 3:49 PM

Share

అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గాదేవిని కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి బి.శ్రీరాములు ఆసక్తికరమైన కోరికను కోరారు. షాహపూర్‌లోని దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించిన ఆయన అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు. అమ్మవారి పాదాల చెంత ఓ పేపర్‌ను పెట్టారు.. దేవిని ప్రార్థించారు. లిఖితపూర్వక అభిలాషను నెరవేర్చాల్సిందిగా వేడుకున్నారు. ఆ పేపర్‌లో ఏం రాశారన్నది అక్కడున్నవారికి ఆసక్తిగొలిపింది.. విలేకరులకు కూడా క్యూరియాసిటీ పెరిగింది.. విషయాన్ని శ్రీరాములు నుంచే తెలుసుకుందామనే ప్రయత్నం చేశారు.. ‘ఏముందో ఎలా చెబుతాను.. అది నాకు అమ్మవారికి మధ్య ఉన్న విషయం’ అంటూ తేల్చేశారు. విలేకరులు ఊరుకుంటారా? వెళ్లి ఆలయ పూజారి మారెప్పను కలిశారు.. విలేకరులకు పూజారి వరమిచ్చాడు.. ఆ పేపర్‌లో ఏం రాశారో చెప్పేశారు.. ఇంతకీ శ్రీరాములు ఏం కోరుకున్నారట అంటే.. తనను డిప్యూటీ సీఎంను చేయమని వేడుకున్నారట! తన కోరికను వీలైనంత తొందరలో తీర్చమంటూ ప్రార్థించారట! శ్రీరాములు అమ్మవారికి వీరభక్తుడు. కరోనా వైరస్‌ ప్రబలిపోతున్న సమయంలోనూ ఆరోగ్యశాఖ మంత్రి బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆయన నిమ్మలంగా ఉన్నారు.. అంతా అమ్మవారే చూసుకుంటారని ఒక్క ముక్కలో తేల్చేశారు. షాహపూర్‌ దుర్గాదేవి ఆలయంలో ఇలా భక్తులు తమ కోరికలను పేపర్‌మీద రాసి అమ్మవారి పాదాల చెంత ఉంచడం ఆనవాయితీ! ప్రార్థనలు అయ్యాక ఆ పేపర్‌ను పూజారికి అందిస్తారు. శ్రీరాములు కూడా అలాగే చేశారు.. ఈ ఏడాది ఆరంభంలో కర్నాకట కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌ కూడా దుర్గాదేవిని దర్శించుకున్నారు.. మనీ లాండరింగ్‌ కేసులో జైలు శివకుమార్‌ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే! జైలు నుంచి విడుదల కాగానే ఆయన మొదట వెళ్లింది షాహపూర్‌ ఆలయానికే! నిరుడు జులైలో యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే తనకు డిప్యూటీ సీఎం పదవి గ్యారంటీ అని అనుకున్నారు శ్రీరాములు.. కాని అధిష్టానం మరోటి అనుకుంది.. మూడు డిప్యూటీ సీఎం పదవులనైతే కేటాయించింది కానీ ఒకటి లింగాయత్‌లకు, రెండోది వొక్కలింగాలకు, మూడోది దళితులకు కట్టబెట్టింది.. కర్నాటకలో ఈ మూడు సామాజికవర్గాలు ప్రధానమైనవే! దాంతో శ్రీరాములు కోరిక నెరవేరకుండాపోయింది.. కనీసం ఇప్పుడైనా ఆ పదవి తనకు వచ్చేలా చూడమని అమ్మవారిని వేడుకున్నారాయన! జగదేక మాతా గౌరీ. కరుణించవే భవానీ కరుణించవే అంటూ భక్తిగీతాలు పాడుకుంటున్నారు..

కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..