కొత్త జాతీయ విద్యా విధానంపై రాష్ట్రపతి కామెంట్
21వ శతాబ్ధపు లక్ష్యాలను కొత్త జాతీయ విద్యా విధానం అందుకుంటుందని రాష్ట్రపతి రామ్ నాథ్ చెప్పారు. కేంద్రం కొత్తగా తెచ్చిన ఎన్ఈపీ దేశంలో విద్యావ్యవస్థ తీరుతెన్నులను మార్చివేస్తుందని ఆయన అన్నారు.

21వ శతాబ్ధపు లక్ష్యాలను కొత్త జాతీయ విద్యా విధానం అందుకుంటుందని రాష్ట్రపతి రామ్ నాథ్ చెప్పారు. కేంద్రం కొత్తగా తెచ్చిన ఎన్ఈపీ దేశంలో విద్యావ్యవస్థ తీరుతెన్నులను మార్చివేస్తుందని ఆయన అన్నారు. నాణ్యమైన విద్యను అందిస్తూ సమాన, ఉత్తేజపూరిత, ఉజ్వలమైన సమాజాన్ని స్థాపించేందుకు ఈ కొత్త విద్యావిధానం పనిచేస్తుందన్నారు. మార్క్‌లు, గ్రేడ్లు, వంటి ప్రమాణాలు కాకుండా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుదలకు ఈ కొత్త విద్యా వ్యవస్థ ఉపకరిస్తుందని ఆయన చెప్పారు. ప్రాచీన కాలంలో విద్యా క్షేత్రంగా భారత్‌కు పేరుందని చెప్పిన రాష్ట్రపతి.. తక్షశిల, నలంద వర్సిటీల ప్రాముఖ్యతను గుర్తుచేశారు. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలకు గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో మంచి పొజిషన్ రావడం లేదన్న ఆయన.. 2035 లోగా ఉన్నత విద్యలో ఎన్‌రోల్మెంట్‌ను 50 శాతానికి పెంచాలని ఎన్ఈపీ లక్ష్యంగా ఉందని కోవింద్ వెల్లడించారు. ‘ఎన్ఈపీ 2020.. ఉన్నత విద్య’ అంశంపై జరిగిన విజిటర్స్ కాన్ఫెరెన్స్ లో రామ్ నాథ్ కోవింద్ వర్చువల్ గా తన సందేశం ఇచ్చారు.




