మాజీ ప్రధాన మంత్రి మనవడు ప్రజ్వల్ రేవణ్ణ బూతు బాగోతంపై కర్నాటకలో రచ్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రజ్వల్ అసభ్యకర దృశ్యాలకు సంబంధించిన టేపులు బయటపడడం, ఆయన జర్మనీకి వెళ్లిపోవడంపై విపక్షాలు బీజేపీని నిలదీస్తున్నాయి. అయితే ఇదంతా ప్రత్యర్ధుల కుట్ర అని, న్యాయ విచారణలో అన్ని విషయాలు తేలుతాయంటున్నారు ప్రజ్వల్ కుటుంబసభ్యులు.
ఓ పెన్ డ్రైవ్.. అందులో ఒకటి కాదు రెండు కాదు.. 3000 బూతు వీడియోలు. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాయి. లోక్‌సభ ఎన్నికల వేళ ఈ టేపులు బయటకు రావడం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రజ్వల్ రేవణ్ణ బూతు బాగోతంపై కర్నాటకలో రచ్చ జరుగుతోంది. ఇదే సమయంలో ప్రజ్వల్ జర్మనీకి వెళ్లిపోవడంపై విపక్షాలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఇదంతా ప్రత్యర్ధుల కుట్ర అని , న్యాయవిచారణలో అన్ని విషయాలు తేలుతాయంటున్నారు ప్రజ్వల్ కుటుంబసభ్యులు.
ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచార కేసులు నమోదైనప్పటికి విదేశాలకు ఎలా వెళ్లిపోయాడని కాంగ్రెస్‌తో సహా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. నాలుగేళ్ల పాత వీడియోలతో తన కుమారుడిపై ప్రత్యర్ధులు కుట్ర చేశారని ప్రజ్వల్ తండ్రి రేవణ్ణ ఆరోపిస్తున్నారు. తాము భయపడి పారిపోయే రకం కాదన్నారు. ఎలాంటి కుట్ర జరుగుతోందో తెలుసని, తాజాగా విడుదల చేసిన వీడియోలు 4-5 ఏళ్ల క్రితం నాటివి. ప్రజ్వల్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం అధినాయకత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దర్యాప్తు చేయనివ్వాలన్నారు. గత 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చాలా దర్యాప్తులను ఎదుర్కొన్నాం. సిట్ లేదా సీఐడీకి అప్పగించాలని కోరారు రేవణ్ణ. ఈ వ్యవహారంపై స్పందించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సిట్‌తో లేదా సీఐడీతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. దర్యాప్తు నివేదిక వచ్చిన తరువాత స్పందిస్తానని, రాష్ట్ర ప్రభుత్వం ఏమి తేలుస్తుదో చూడాలన్నారు.
తన సోదరుడి కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణపై చర్య తీసుకుంటామని JDS నేత కుమారస్వామి అన్నారు. ఆ వీడియోల వ్యవహారం తమ కుటుంబానికి ఎంతో ఇబ్బంది పెట్టిందని తెలిపారు. తాము మహిళలను గౌరవిస్తామని, ఈ వ్యవహారంలోకి మాజీ ప్రధాని దేవేగౌడ పేరును లాగొద్దని కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. పోలింగ్‌కు ముందు కొన్ని పెన్ డ్రైవ్‌లను విడుదల చేశారు. ప్రజ్వల్ గురించి ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వాస్తవాలను బయటకు తీసుకురావాలి. ఈ టేపులతో మా కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని కుమారస్వామి ధ్వజమెత్తారు.
హేయమమైన పనులు చేసిన ప్రజ్వల్ రేవణ్ణ విషయంలో ప్రధాని మోదీ మౌనం దేనికి సంకేతమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. ప్రజ్వల్‌ను గెలిపించమని కోరుతూ పది రోజుల క్రితం మోదీ ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఆయనను ప్రశంసించారు. ఇప్పుడు ఆయన దేశం విడిచి పారిపోయారని ప్రియాంక సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ప్రజ్వల్ అరాచకాలు వింటుంటే గుండె వణికిపోతోందని ప్రియాంక అన్నారు.
రేవణ్ణ ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్న సమీప బంధువు ఈ విషయాలను బయటపెట్టడం మరింత సంచలనం రేపింది. రేవణ్ణతో పాటు ఆయన కుమారుడు ప్రజ్వల్ తనపై, తన కూతురిపై పలుమార్లు లైంగికదాడి చేశారని ఆ మహిళ ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. రేవణ్ణ నివాసంలో ఆరుగురు మహిళలు, యువతులు పని చేస్తున్నారు. పనిలో చేరిన నాలుగు నెలల నుంచి తనపై దౌర్జన్యానికి పాల్పడుతూ వచ్చారని బాధితురాలు ఆరోపించారు. రేవణ్ణ భార్య భవానీ ఇంట్లో లేని సమయంలోనే తనపై లైంగిక దౌర్జన్యానికి దిగేవారని బాధితురాలి ఆరోపించింది. పండ్లు ఇచ్చే నెపంతో స్టోరూమ్‌కు పిలిచి వేధించేవారని ఆరోపించారు.. తాను వంట గదిలో ఉన్నప్పుడు ప్రజ్వల్ రేవణ్ణ శరీరాన్ని తాకుతూ వేధించేవారని ఆవేదన వ్యక్తం చేసింది.
అంతేకాదు నలుగు స్నానం చేయించాలని, ఒంటికి తైలాన్ని పెట్టి స్నానం చేయించాలని స్నానాలగదికి తీసుకువెళ్లి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడని కన్నీరుమున్నీరయ్యింది. ఇంట్లో నుంచి తన కుమార్తెకు వీడియో కాల్ చేసి ప్రజ్వల్ అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపింది. అతని చేష్టలకు భయపడి కుమార్తె ప్రజ్వల్ ఫోన్ నంబరును బ్లాక్ చేసుకుందని, ఆ తర్వాత తానూ పని విడిచిపెట్టి బయటకు వచ్చేశానని తెలిపింది
ఇదిలావుంటే కర్నాటకలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ఒక్క రోజు ముందే ఈ వీడియోలు బయటపడడం పలు అనుమానాలకు తావిస్తోంది. కావాలనే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మార్ఫింగ్ వీడియోలతో ప్రత్యర్ధులు కుట్ర చేశారని ఆరోపించారు రేవణ్ణ. JDS ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు బెంగళూరు, హుబ్లీలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రజల్ నేరాలను బీజేపీ కాపాడిందని ఆరోపించారు. నేరానికి పాల్పడిందని సామాన్య వ్యక్తి కాదని, ఒక ఎంపీ అని అన్నారు. ప్రజ్వల్ అరెస్టును డిమాండ్ చేస్తూ కర్నాటక డీజీపీకి కాంగ్రెస్ కార్యకర్తలు కలిశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…