AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: అమిత్ షాతో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై భేటీ.. మంత్రివర్గంలో భారీగా మార్పులు?

కేబినెట్ విస్తరణపై చర్చించేందుకు బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సమావేశమమయ్యారు.

Karnataka: అమిత్ షాతో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై భేటీ.. మంత్రివర్గంలో భారీగా మార్పులు?
Basavaraj Bommai Meets Amit Shah
Balaraju Goud
|

Updated on: May 11, 2022 | 8:45 PM

Share

Basavaraj Bommai meets Amit Shah: కర్ణాటక మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణపై ఊహగానాలు జోరందుకున్నాయి. కేబినెట్ విస్తరణపై చర్చించేందుకు బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సమావేశమమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మంత్రివర్గ మార్పు చేర్పులను పరిశీలించిన తర్వాత కేంద్ర నాయకత్వం తన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ‘ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చు’ అని అన్నారు.

రానున్న రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి బొమ్మై చెప్పారు. అమిత్ షాను కలిశాను, పలు అంశాలపై మాట్లాడాను, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా చర్చించాం. తాజా రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించానని సీఎం బొమ్మై వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకుని తెలియజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

ముఖ్యమంత్రి బొమ్మై ప్రస్తుతం మంత్రివర్గాన్ని త్వరగా విస్తరించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కేబినెట్‌లో ముఖ్యమంత్రితో సహా 29 మంది మంత్రులు ఉండగా ఐదు స్థానాలు ఖాళీగా ఉండగా, మంజూరైన సంఖ్య 34గా ఉంది.

గత వారం ప్రారంభంలో, బిజెపి రాష్ట్ర ఇన్‌ఛార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మాట్లాడుతూ, కర్ణాటకలో నాయకత్వ మార్పుపై చర్చ కల్పితమన్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై లాంటి సామాన్యుడు అంటే ఇక్కడి ప్రజలు ఇష్టపడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ ముఖ్యమంత్రి అధికారమని కూడా ఆయన అన్నారు.