రైతు బిల్లులకు ‘తమిళ ప్రభుత్వ’ సమర్ధన, మండిపడిన కమల్ హాసన్

వివాదాస్పద రైతు బిల్లులకు తమిళనాడు ప్రభుత్వం మద్దతు తెలపడాన్ని సినీ నటుడు, పొలిటీషియన్ కమల్ హాసన్ తీవ్రంగా ఖండించారు. ఇది రైతులకు ద్రోహం చేయడమేనన్నారు. ఈ బిల్లులు రాష్ట్ర ప్రతిపత్తిని నాశనం చేస్తాయని..

  • Umakanth Rao
  • Publish Date - 5:34 pm, Sun, 27 September 20
రైతు బిల్లులకు 'తమిళ ప్రభుత్వ' సమర్ధన,  మండిపడిన కమల్ హాసన్

వివాదాస్పద రైతు బిల్లులకు తమిళనాడు ప్రభుత్వం మద్దతు తెలపడాన్ని సినీ నటుడు, పొలిటీషియన్ కమల్ హాసన్ తీవ్రంగా ఖండించారు. ఇది రైతులకు ద్రోహం చేయడమేనన్నారు. ఈ బిల్లులు రాష్ట్ర ప్రతిపత్తిని నాశనం చేస్తాయని, ధరలు మరింత మండిపోయి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన హెచ్ఛరించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వీటిని పార్లమెంటుకు తిప్పి పంపాలని, వీటిపై సభలో చర్చ జరిగితేనే రైతులకు  కొంతయినా న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తనను రైతుగా చెప్పుకునే ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ బిల్లులకు ఎలా మద్దతునిస్తున్నారని కమల్ హాసన్ ప్రశ్నించారు. తమిళనాడులో వచ్ఛే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో అన్నదాతలు ఈ ప్రభుత్వాన్ని మట్టిలో పూడ్చిపెట్టడం ఖాయం అని ఆయన వ్యాఖ్యానించారు. తన స్టేట్ మెంట్ ఇస్తున్న సందర్భంగా ఆయన ఈ బిల్లుల తాలూకు ప్రతులను చించి పోగులు పెట్టారు.