K.A. Paul: బీజేపీకి ప్రజాశాంతి పార్టీ మాత్రమే ప్రతిపక్షం.. త్వరలో మోడీని కలుస్తా.. కేఏ పాల్

K.A. Paul: బీజేపీకి ప్రజాశాంతి పార్టీ మాత్రమే ప్రతిపక్షం.. త్వరలో మోడీని కలుస్తా.. కేఏ పాల్
K A Paul

ప్రజాశాంతి పార్టీ 178 సీట్లలో గెలుస్తుందని ఈశాన్యంలోని 8 రాష్ట్రాల్లో 25, దక్షిణాది రాష్ట్రాల్లో 150, పాండిచ్చేరి, గోవాలో కలిపి 178 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారు పాల్. తనది సెక్యులర్ పార్టీ.. కనుక పోటీ చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయని అమిత్ షా చెప్పారని అన్నారు.

Surya Kala

|

May 13, 2022 | 3:43 PM

K.A Paul: మనదేశంలో కుటుంబ పాలనతో మరో శ్రీలంక (Srilanka), నైజిరీయా(Nigeria), వెనిజ్యులాలా మారుతోందని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తాను శ్రీలంకలో ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సకు కుటుంబ పాలన వద్దు అని చెప్పాను… అయినా నా మాట వినలేదని అన్నారు. మోడీ రాక ముందురూ. 50 లక్షల కోట్ల అప్పు ఉంటే.. మోడీ ప్రధాని అయ్యాక మరో రూ. 50 లక్షల కోట్లు అప్పులు చేశారని వెల్లడించారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సైతం అప్పుల కుప్పగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ అప్పు రూ. 8 లక్షల కోట్లు, తెలంగాణ అప్పు రూ. 4.5 లక్షల కోట్లు ఉందని.. అసలు దేశంలో సంపదను  కుటుంబ పార్టీలు దోచుకుంటున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పాల్.

కేసీఆర్ కుటుంబ పాలన ప్రపంచంలోనే వరస్ట్ పాలన అంటూ తీవ్ర విమర్శలు చేశారు. శ్రీలంకలో ఒక కుటుంబం నుంచి ఐదుగురు పాలించారు. తెలంగాణలోనూ కేసీఆర్ కుటుంబం నుంచి ఐదుగురు పాలిస్తున్నారు.. మరోవైపు చంద్రబాబు తన కొడుకు కోసం పాకులాడుతున్నాడని అన్నారు. ఇటు చంద్రబాబు రూ. 6 లక్షల కోట్లు ఏమయ్యాయో చెప్పడు.. అటు కేసీఆర్ రూ. 7 లక్షల కోట్లు ఏం చేశాడో చెప్పడని ఆరోపించారు పాల్. తాను గురువారం కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీలో ఒక గంట పాటు.. అనేక అంశాలతో చర్చించానని తెలిపారు పాల్. ఈ సమావేశంలో అసలు దేశంలో ఏం జరుగుతోంది అమిత్ షా తాను ప్రశ్నించినట్లు వెల్లడించారు పాల్.

కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలాతో నిన్న 3 గంటల పాటు సమావేశమయ్యారు. తనకు అమిత్ షా ఫోన్ చేస్తేనే.. వెళ్లి కలిసి నట్లు చెప్పారు పాల్. తనపై జరిగిన దాడిని బహిరంగంగా ఖండించాలని చెప్పానని.. ఈ దాడిపై చర్యలు తీసుకుంటామని అమిత్ షా చెప్పినట్లు వెళ్లించారు పాల్.

కేసీఆర్, చంద్రబాబు నాయుడు దోచుకున్న లక్షల కోట్ల రూపాయల సొమ్ముపై సీబీఐ, ఈడీ ద్వారా విచారణ జరపాలని కోరినట్లు వెల్లడించారు. దేశంలో ఒక సదస్సు నిర్వహించి 100 బిలియన్ డాలర్లు తీసుకొచ్చేలా చేద్దాం అని అమిత్ షా కు సూచించానని.. ఇదే విషయంపై ఒకట్రెండు వారాల్లో ప్రధాని మోడీ తో కలిసి చర్చించనున్నామని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రాల్లో భూస్థాపితం అయిపోయింది. గాంధీ కుటుంబాన్ని తప్ప ఇంకో కుటుంబాన్ని వాళ్లు నమ్మరు. ఇక బీజేపీకి ప్రశాంతి పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా ఉంటుందని అన్నారు. తమ పార్టీ 178 సీట్లలో గెలుస్తుందని ఈశాన్యంలోని 8 రాష్ట్రాల్లో 25, దక్షిణాది రాష్ట్రాల్లో 150, పాండిచ్చేరి, గోవాలో కలిపి 178 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారు పాల్. తనది సెక్యులర్ పార్టీ.. కనుక పోటీ చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయని అమిత్ షా చెప్పారని అన్నారు.

నా FCRA లైసెన్సు గురించి అమిత్ షాతో చర్చించలేదు. FCRA లైసెన్సులు రద్దు చేసినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించాను. ఢిల్లీ హైకోర్టులో న్యాయపోరాటం చేశాను. 16వేల ఎన్జీవోల లైసెన్సులు పునరుద్ధరించేలా సహాయం చేశాను. కానీ ఏరోజూ నా స్వప్రయోజనాల కోసం పోరాటం చేయలేదని అన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లి 178 ఎన్జీవోల లైసెన్సులు రిస్టోర్ చేశాం. దీంతో అన్ని ఎన్జీవోలకు రూ. 55 వేల కోట్లు వచ్చాయని తెలిపారు పాల్.

ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ, మత స్వేచ్ఛ ఉండాలి. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి. ప్రజల తరఫున నేను ఎప్పుడూ ఉంటాను. జెడ్ ప్లస్ భద్రత కోసం లెటర్ పెట్టమని రూపాలా అడిగితే పెట్టాను. మీకు భద్రత కావాలా అని అడిగితే దేవుడే నాకు సెక్యూరిటీ, నా తెలుగు ప్రజలే సెక్యూరిటీ అని చెప్పానని పాల్ తెలిపారు. చ ట్టప్రకారం కేంద్రం సెక్యూరిటీ ఇస్తే తీసుకుంటానని చెప్పాను. అమిత్ షాతో చర్చలో పవన్ కళ్యాణ్ గురించి చర్చకొచ్చిందన్నారు పాల్. ఏపీలో పవన్ కళ్యాణ్‌కు 2-3 శాతం తప్ప ఓటు బ్యాంకు లేదని, మీరెందుకు ఆయన వెంటపడుతున్నారని తాను అడిగిన ప్రశ్నకు అమిత్ షా తాము పవన్ వెంటపడలేదని .. పవనే మా వెంటపడుతున్నారని అన్నట్లు తెలిపారు పాల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో 42 స్థానాల్లో ఒక్క ఎంఐఎం సీటు తప్ప మిగతా 41 సీట్లలో ప్రశాంతి పార్టీ గెలుస్తుందని.. ఈ మేరకు ఎప్పుడో ప్రజలు నిర్ణయం తీసుకున్నారని పాల్ చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu