Jyothiradhitya Scindia: డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..

ఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటూ టెలికాం కమ్యూనికేషన్ విభాగానికి చెందిన ముఖ్యకార్యదర్శులు, పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరు అయ్యారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ థీమ్ ను లాంచ్ చేశారు కేంద్ర మంత్రి సింధియా. ఆ తరువాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

Jyothiradhitya Scindia: డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
Jyothiradhitya Scindia
Follow us
Srikar T

|

Updated on: Jul 18, 2024 | 11:57 PM

ఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటూ టెలికాం కమ్యూనికేషన్ విభాగానికి చెందిన ముఖ్యకార్యదర్శులు, పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరు అయ్యారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ థీమ్ ను లాంచ్ చేశారు కేంద్ర మంత్రి సింధియా. ఆ తరువాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని విజన్ ఉన్న నాయకుడు అని కొనియాడారు. తాను దగ్గరి నుంచి చూశానన్నారు. అందుకే ఈ విషయాన్ని చెబుతున్నానని పేర్కొన్నారు. ఈ వినూత్న కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. నేడు సాంకేతికతను యువత చాలా బాగా అందిపుచ్చుకుంటోందన్నారు. మన దేశంలో సాంకేతికత అనేక రంగాల్లో విస్తరించిందన్నారు.

కమ్యూనికేషన్, టెక్నాలజీ రంగాలు యువతకు అనేక రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు. కమ్యూనికేషన్, నెట్వర్ సంబంధించిన విద్యకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. రానున్న రోజుల్లో టెలీకమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయన్నారు. సరికొత్త సంస్కరణలు కూడా తీసుకురానున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో భారత్ డిజిటల్ వేదికగా మారనుందన్నారు. గడిచిన దశాబ్ధకాలంగా ఈ అభివృద్దికి సంబంధించిన అడుగులు పడ్డాయని చెప్పారు. డిజిటల్ ఇండియా మిషన్ లో భాగంగా అభివృద్ది చెందిన దేశాలతో పోటీ పడి భారత్ రానున్న రోజుల్లో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. వాటికి సంబంధించిన కొత్త పాలసీలను తీసుకొస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో 5జీ సేవలు విరివిగా లభిస్తాయన్నారు. ఇండియా ఇతర దేశాలకు 5జీ నెట్వర్క్ ను ఎగుమతి చేసేలా విస్తరిస్తుందన్నారు. టెలీకమ్యూనికేషన్ ను ఒక స్థిరమైనదిగా రూపొందించేందకు ఈ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?