INDIA: ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్ధి ఎవరు..? నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు.. గెహ్లాట్‌ ఏమన్నారంటే..

|

Aug 28, 2023 | 10:17 PM

INDIA convener: విపక్ష ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్ధి కోసం రేసు మొదలయ్యింది. రాహుల్‌గాంధీని మించిన నేత లేడని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ప్రకటించగా.. బీహార్‌ సీఎం నితీష్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని జేడీయూ నేతలు వాదిస్తున్నారు. ఆగస్ట్‌ 31, సెప్టెంబర్‌ 1వ తేదీల్లో ముంబైలో జరిగే ఇండియా కూటమి సమావేశంలో ఈవిషయంపై కీలకచర్చ జరిగే అవకాశం ఉంది.

INDIA: ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్ధి ఎవరు..?  నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు.. గెహ్లాట్‌ ఏమన్నారంటే..
INDIA Alliance
Follow us on

INDIA Alliance Meeting: ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధి ఎవరు..? ఈవిషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆగస్ట్‌ 31, సెప్టెంబర్‌ 1వ తేదీల్లో ముంబైలో ఇండియా కూటమి సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశంలో ఇండియా కూటమి ఉమ్మడి జెండాను, ఏజెండాను ప్రకటించబోతున్నారు. రాష్ట్రాల్లో ఎవరి గుర్తుపై వాళ్లే పోటీ చేయాలని కూటమి పార్టీలు ఇప్పటికే నిర్ణయించాయి. అయితే ఇండియా కూటమి కన్వీనర్‌గా ఎవరు ఉంటారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ను కన్వీనర్‌గా ఎన్నుకుంటారని ప్రచారం జరిగింది. అయితే తనకు ఆ పదవి మీద ఆసక్తి లేదని నితీష్‌ తేల్చేశారు.

మరోవైపు విపక్షాల ప్రధాని అభ్యర్ధి ఎవరన్న విషయంపై కూడా సస్సెన్స్‌ నెలకొంది. ఈవిషయంలో సందేహం అక్కర్లేదని , ముమ్మాటికి రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్ధిగా బరిలో ఉంటారని సంచలన ప్రకటన చేశారు రాజస్థాన్‌ సీఎం అశోక్‌గెహ్లాట్‌. రాహుల్‌గాంధీకి ప్రధానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయన్నారు అశోక్‌ గెహ్లాట్‌. అయితే ఏకపక్షంగా రాహుల్‌గాంధీ పేరును ప్రకటించడంపై ఇండియా కూటమిలో భిన్నస్వరాలు విన్పిస్తున్నాయి.

నితీష్‌కు అన్ని అర్హతలున్నాయ్..

ఇండియా కూటమి కన్వీనర్‌ పదవితో పాటు ప్రధాని పదవి మీద కూడా ఆసక్తి లేదన్నారు నితీష్‌కుమార్‌. అయితే జేడీయూ నేతలు మాత్రం నితీష్‌కు ప్రధానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని అంటున్నారు. నితీష్‌కు అన్ని అర్హతలు ఉన్నప్పటికి తాము విపక్షాల ఐక్యతకే ప్రాధాన్యత ఇస్తునట్టు జేడీయూ నేత కేసీ త్యాగి తెలిపారు. జేడీయూ నేత కేసీ త్యాగి మాట్లాడుతూ.. ‘‘నితీష్‌కుమార్‌కు ప్రధాని పదవితో పాటు ఇండియా కూటమి కన్వీనర్‌ చేపట్టేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. అయితే 2024 ఎన్నికల్లో గెలుపే మాకు ముఖ్యం. కన్వీనర్‌ పదవి, ప్రధాని పదవి మాకు ముఖ్యం కాదు.. నితీష్‌కుమార్‌కు ప్రధాని పదవి చేపట్టేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. 16 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు కూడా వెళ్లారు. వాజ్‌పేయి కేబినెట్‌లో కీలక పదవులు నిర్వహించారు. అయితే పదవుల కంటే మాకు విపక్షాల ఐక్యతే ముఖ్యం.’’ అంటూ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ముంబైలో భారీ ఏర్పాట్లు..

మరోవైపు, ఇండియా కూటమిని విస్తరించడానికి నితీష్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. శిరోమణి అకాలీదళ్‌తో పాటు ఇండయన్‌ నేషనల్‌ లోకదళ్‌ పార్టీల నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. ముంబైలో ఇండియా కూటమి సమావేశాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పలు చోట్ల బ్యానర్లు , కటౌట్లు ఏర్పాటు చేశారు. అయితే, ఇండియా కూటమి సమావేశాల్లో పలు కీలక విషయాలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..