సెక్యూరిటీ పోరడు.. యూనివర్సిటీలో సీట్ కొట్టిండు!

ఢిల్లీ: మనసులో పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే అసాధ్యం కానీ పనంటూ ఏదీ ఉండదు. దీనికి సరైన ఉదాహరణ ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీలో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ రాంజల్ మీనా. చిన్ననాటి నుంచి రష్యా, ఆ దేశ సంస్కృతిపై మక్కువ పెంచుకున్న అతడు కొద్దిరోజుల్లో ఆ దేశ భాషను అతడు సెక్యూరిటీగా పని చేస్తున్న జేఎన్‌యూలో చదవబోతున్నాడు. చిన్నప్పటి నుంచే చదువుల్లో ఫస్ట్‌లో ఉండే రాంజల్‌ మీనా.. ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఇంటర్‌తోనే చదువు […]

  • Ravi Kiran
  • Publish Date - 3:52 pm, Wed, 17 July 19
సెక్యూరిటీ పోరడు.. యూనివర్సిటీలో సీట్ కొట్టిండు!

ఢిల్లీ: మనసులో పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే అసాధ్యం కానీ పనంటూ ఏదీ ఉండదు. దీనికి సరైన ఉదాహరణ ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీలో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ రాంజల్ మీనా. చిన్ననాటి నుంచి రష్యా, ఆ దేశ సంస్కృతిపై మక్కువ పెంచుకున్న అతడు కొద్దిరోజుల్లో ఆ దేశ భాషను అతడు సెక్యూరిటీగా పని చేస్తున్న జేఎన్‌యూలో చదవబోతున్నాడు.

చిన్నప్పటి నుంచే చదువుల్లో ఫస్ట్‌లో ఉండే రాంజల్‌ మీనా.. ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఇంటర్‌తోనే చదువు ఆపేశాడు. అయితే చదువు మీద ఉన్న మక్కువే అతడ్ని జేఎన్‌యూ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో అర్హత సాధించేలా చేసింది. ఇక ఎగ్జామ్‌లో పాస్ అయిన రాంజల్ మీడియాతో మాట్లాడుతూ ‘అర్హత సాధించినందుకు సంతోషంగా ఉందని.. ఎప్పటికైనా రష్యా దేశం వెళ్తానని’ తన మనసులోని మాటను పంచుకున్నాడు.