AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JNU VC: జేఎన్‌యూ కొత్త వీసీ శాంతిశ్రీ ముందున్న సవాళ్లు.. ఆమె ఎదుర్కొంటున్న విమర్శలు ఏంటి.?

JNU VC: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి తొలి మహిళా వీసీగా శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ నియమితులైన విషయం తెలిసిందే. అంతకు ముందు జేఎన్‌యూ వీసీగా ఉన్న జగదీశ్‌ కుమార్‌ యూజీసీ ఛైర్మన్‌గా ఎంపికకావడంతో ఆ స్థానంలోకి శాంతిశ్రీ వచ్చారు...

JNU VC: జేఎన్‌యూ కొత్త వీసీ శాంతిశ్రీ ముందున్న సవాళ్లు.. ఆమె ఎదుర్కొంటున్న విమర్శలు ఏంటి.?
Jnu Vc
Narender Vaitla
|

Updated on: Feb 14, 2022 | 6:12 PM

Share

JNU VC: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి తొలి మహిళా వీసీగా శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ నియమితులైన విషయం తెలిసిందే. అంతకు ముందు జేఎన్‌యూ వీసీగా ఉన్న జగదీశ్‌ కుమార్‌ యూజీసీ ఛైర్మన్‌గా ఎంపికకావడంతో ఆ స్థానంలోకి శాంతిశ్రీ వచ్చారు. ఇలా జేఎన్‌యూకి ఎంపికైన తొలి వీసీగా శాంతిశ్రీ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఇక శాంతిశ్రీ కెరీర్‌ విషయానికొస్తే ఆమె 1983లో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి బి.ఏ. (చరిత్ర, సోషల్‌ సైకాలజీ) విభాగంలో తొలి డిగ్రీ సంపాదించారు. 1985లో అదే కాలేజీలో పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో ఎం.ఏ. పూర్తి చేశారు. 1990లో శాంతిశ్రీ ఆ యూనివర్సిటీలో ఎంఫిల్‌తో పాటు అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1996లో స్వీడన్‌లోని ఉప్సలా యూనివర్సిటీ నుంచి శాంతి, సంఘర్షణలో పోస్ట్ డాక్టొరల్ డిప్లొమా, అలాగే అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి సామాజిక సేవా విభాగంలో డిప్లొమా చేశారు.

ఇదిలా ఉంటే శాంతిశ్రీ ఇలా వీసాగా నియమితులయ్యారో లేదో అలా విమర్శలు చుట్టుముట్టాయి. ఆమె హిందుత్వ వాది అంటూ గతంలో ఆమె షేర్‌ చేసిన ట్వీట్లే దీనికి సాక్ష్యం అంటూ కొందరు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేశారు. ఆమెకు వీసీగా కొనసాగే హక్కు లేదని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఈ విషయమంపై ఆమె తాజాగా స్పందించారు. తనకు అసలు ట్విట్టర్‌ అకౌంట్‌ లేదని చెప్పిన శాంతిశ్రీ, అసలు ఈ వివాదాన్ని ఎవరు సృష్టించారో తెలియడం లేదని, తనకు అసలు ట్విట్టర్‌ అకౌంట్‌ లేదని, ఇది ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తున్నారంటూ తనపై వస్తోన్న విమర్శలకు చెక్‌ పెట్టే ప్రయత్నం చేశారు శాంతిశ్రీ.

విమర్శలతోనే పదవిని స్వీకరించిన శాంతిశ్రీ భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఢిల్లీ జేఎన్‌యూ అంటేనే రాజకీయాలకు కేంద్ర బిందువులా ఉంటుంది. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచే జేఎన్‌యూకు వీసీగా వ్యవహరించడం నిజంగానే శాంతిశ్రీకి కత్తి మీద సాము లాంటిదని చెప్పాలి. ఇప్పటి వరకు వీసీగా పనిచేసిన జగదీశ్‌ కుమార్‌కు విద్యార్థుల ఉద్యమాన్ని విజయవంతంగా అణిచివేశారన్న పేరుంది. అయితే విద్యా వ్యవస్థలోనూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పాలి. అయితే ప్రస్తుతం విధుల్లోకి వచ్చిన శాంతిశ్రీ ముందు పెను సవాళ్లు ఉన్నాయని చెప్పాలి. ఇప్పటికే హిందూవాది అని ముద్ర వేసుకున్న కొత్త వీసీ విద్యార్థుల విమర్శలను ఎదుర్కొంటూ యూనివర్సిటీ కోసం పనిచేయాల్సి ఉంటుంది.

ముఖ్యంగా నెట్‌ అర్హత, మల్టీపుల్‌ ఛాయిస్‌ క్వశ్చన్స్‌, రిజర్వేషన్ల కల్పన, ఫీజుల పెంపు, హాస్టల్స్‌ సంఖ్య తగ్గింపు వంటి సమస్యలు శాంతిశ్రీకి సవాళ్లుగా మారనున్నాయి. అంతేకాకుండా శాంతిశ్రీ వీసీగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు కొంత మంది స్టూడెంట్ యూనియన్‌ నాయకులు శాంతిశ్రీని కలవడానికి వెళితే ఆమె దానికి నిరాకరించారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్న ఏబీవీపీ నాయకులు వెళేతే మాత్రం వెంటనే కలవడానికి ఆసక్తి చూపించారు. ఇది కూడా తీవ్ర విమర్శలకు దారి తీసింది.

ఇదిలా ఉంటే దేశంలో పలు యూనివర్సిటీల్లో వీసీల ఎంపికలో రాజకీయ ప్రమేయం ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది బహిరంగా రహస్యేమనని చెప్పాలి. బీజేపీ అధికారికంలోకి వచ్చిన తర్వాత ఈ ట్రెండ్‌ మరింత ఎక్కువైంది. జేఎన్‌యూ, బీహెచ్‌యూ, ఏఎమ్యూ, డీయూ, హెచ్‌సీయూలలో వీసీలు రాజకీయ ప్రమోయంతో నియమితులయ్యారని విద్యార్థులు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఇలాంటి విభిన్న పరిస్థితుల్లో జేఎన్‌యూ వీసీగా నియమితులైన శాంతిశ్రీ మార్పు వైపు అడుగులు వేస్తారా.? లేదా గత వీసీల్లాగే వ్యవహరిస్తారో కాలమే నిర్ణయించాలి.

Also Read” Nayanthara: నయన్‌, విఘ్నేశ్‌ల వాలంటైన్స్‌డే వేడుకలు చూశారా.? అర్థరాత్రి ప్రియుడిని సర్‌ప్రైజ్‌ చేస్తూ..

Andhra Pradesh: ఒక వ్యక్తినే 2 సార్లు కిడ్నాప్ చేసిన కిడ్నాపర్.. ఇదో విచిత్రమైన స్టోరీ

MLC Kavitha: ఇంకోసారి కేసీఆర్‌పై రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్.. ఎమ్మెల్సీ కవిత వార్నింగ్!