MP Dhiraj Sahu: కాంగ్రెస్ ఎంపీ నుంచి స్వాధీనం చేసుకున్న డబ్బుని లెక్కిస్తున్న 50 మంది వ్యక్తులు, 40 యంత్రాలు.. ఎంత దొరికిందంటే..

|

Dec 10, 2023 | 8:31 AM

కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన అక్రమార్జనకు లెక్కించేందుకు అధికారులు రకరకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకూ సాహుకి చెందిన పలు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో రూ.290 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదుతో ఎక్కువగా రూ.500 నోట్లు ఉన్నాయి. అయితే ఈ డబ్బులను లెక్కించేందుకు 40-50 మందిని నియమించారు ఐటీ అధికారులు. అదే సమయంలో నోట్ల లెక్కింపునకు 40 చిన్న, పెద్ద యంత్రాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే మరోవైపు ఇంకా 7 గదులు, 9 లాకర్లు తెరవాల్సి ఉందని చెప్పారు. 

MP Dhiraj Sahu: కాంగ్రెస్ ఎంపీ నుంచి స్వాధీనం చేసుకున్న డబ్బుని లెక్కిస్తున్న 50 మంది వ్యక్తులు, 40 యంత్రాలు.. ఎంత దొరికిందంటే..
Congress Mp Dhiraj Sahu
Follow us on

కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంటి తో పాటు సాహు కి చెందిన పలు ప్రాంతాల్లో చేసిన ఈ దాడిలో చాలా డబ్బు దొరికింది. దొరికిన డబ్బులను లెక్కించడానికి కొన్ని గంటలు కాదని.. చాలా రోజులు పడుతుందని అంటున్నారు. ఇంకా డబ్బు చాలా ఉంది, దొరికిన డబ్బులను ఉంచడానికి ఒకటి కాదు, చాలా అరలు అవసరం అయ్యాయి. దీని తరువాత కూడా, మిగిలిన డబ్బు చాలా సంచులలో నింపారు. జార్ఖండ్‌ కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ ధీరజ్‌ సాహు ఇంట్లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ సోదాల్లో దొరికిన నల్లధనం పరిస్థితి ఇది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో రూ.290 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ డేటా ఇంకా పూర్తి కాలేదు. విచారణ ఇంకా కొనసాగుతోంది. 7 గదులు, 9 లాకర్లు తెరవాల్సి ఉంది.

డబ్బులను లెక్కించేందుకు 40-50 మందితో కూడిన బృందాన్ని నియమించారు. అంతేకాకుండా 40 చిన్న, పెద్ద నోట్ల లెక్కింపు యంత్రాలను ఏర్పాటు చేశారు. స్వాధీనం చేసుకున్న డబ్బును ఒడిశాలోని ఎస్‌బీఐ బలంగీర్‌ బ్రాంచ్‌కు తీసుకొచ్చారు. ఈ డబ్బును మొత్తం 176 బస్తాల్లో తీసుకొచ్చారు. డబ్బుల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. భారతీయ చరిత్రలో ఏ ఏజెన్సీ నిర్వహించని అతిపెద్ద రికవరీగా ఇది పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా రూ. 500 నోట్లు

కాంగ్రెస్ ఎంపీ సాహు కి చెందిన పలుచోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన నగదులో అత్యధికంగా రూ.500 నోటు ఉన్నట్లు సమాచారం. ధీరజ్ సాహు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం బృందం మూడు సూట్‌కేస్‌లను తీసుకొచ్చింది. ఈ సూట్‌ కేసుల్లో ఆభరణాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. అయితే ఈ విషయం ఇంకా ధృవీకరించాల్సి ఉంది.

సాహుకి దూరంగా  కాంగ్రెస్‌ నేతలు?

తమ ఎంపీ సాహు కి చెందిన ఆస్తులపై ఐటీ దాడులు భారీగా పట్టుబడిన నగదుపై ఇప్పటి వరకూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. దీంతో సాహు విషయంలో కాంగ్రెస్ దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎంపీ ధీరజ్ సాహు వ్యాపారంతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో రాశారు. దాడుల్లో  ఇంత భారీ మొత్తంలో నగదు ఎలా రికవరీ అయ్యిందనే దానిపై సాహు వివరణ ఇవ్వాలని కూడా పేర్కొన్నారు.

ఎంపీ ధీరజ్ సాహు వ్యాపారంతో జాతీయ కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని. ఆదాయపు పన్ను శాఖ అధికారులు సాహు ఉన్న ప్రాంతాల నుంచి ఇంత భారీ మొత్తంలో నగదు ఎలా రికవరీ చేస్తుందో అతను మాత్రమే వివరించగలడు..  వివరించాలని పేర్కొన్నారు.

భారత జాతీయ కాంగ్రెస్

ఇప్పటి వరకూ స్పందించని సాహు..

అదే సమయంలో ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ ప్రధాని మోడీతో సహా పలువురు సీనియర్ బిజెపి నాయకులు అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ధీరజ్ సాహు కుటుంబం మద్యంతో పాటు హోటల్, రియల్ ఎస్టేట్, రవాణా ,చేపల వేట వంటి అనేక ఇతర వ్యాపారాలు చేస్తుందని తెలుస్తుంది. అయితే నగదు స్వాధీనంపై ఎంపీ ధీరజ్ సాహు నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..