Champai Soren: హైదరాబాద్‎కు జార్ఖండ్‎ ఎమ్మెల్యేలు.. ఏ రిసాట్‎లో ఉన్నారంటే..

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కార్యక్రమం ముగిసిన కొద్దిసేపటికే కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార జేఎంఎం నేతృత్వంలోని 39మంది సంకీర్ణ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో రాంచీ నుంచి హైదరాబాద్‌ బయల్దేరారు. బేగంపేటకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి రెండు బస్సుల్లో ఎమ్మెల్యేలంతా శామీర్‌పేటలోని ఓ రిసార్ట్‌కు వెళ్లారు.

Champai Soren: హైదరాబాద్‎కు జార్ఖండ్‎ ఎమ్మెల్యేలు.. ఏ రిసాట్‎లో ఉన్నారంటే..
Cm Champai Soren
Follow us
Srikar T

|

Updated on: Feb 02, 2024 | 9:37 PM

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కార్యక్రమం ముగిసిన కొద్దిసేపటికే కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార జేఎంఎం నేతృత్వంలోని 39మంది సంకీర్ణ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో రాంచీ నుంచి హైదరాబాద్‌ బయల్దేరారు. బేగంపేటకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి రెండు బస్సుల్లో ఎమ్మెల్యేలంతా శామీర్‌పేటలోని లియోనియో రిసార్ట్‌కు వెళ్లారు. జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎంకు 29, బీజేపీకి -26, కాంగ్రెస్‌కు -17, ఏజేఎస్‌యూకి ముగ్గురు సభ్యులు ఉన్నారు. అలాగే ఇద్దరు స్వతంత్రులతో పాటు సీపీఐ, ఎన్సీపీ, ఆర్జేడీలకు ఒక్కో సభ్యుడి బలం ఉంది. 81మంది సభ్యుల అసెంబ్లీలో.. జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. తమ ఎమ్మెల్యేలను ప్రతిపక్ష బీజేపీ గాలెం వేసే అవకాశం ఉండటంతో కూటమి అప్రమత్తమైంది. జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు షిప్ట్ చేసింది.

రాజ్‌భవన్‌లో చంపాయ్ సోరెన్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌ 10 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించారు.. అప్పటిదాకా ఎమ్మెల్యేలంతా క్యాంప్‌కే పరిమితం కానున్నారు. ఆపరేషన్ జార్ఖండ్ బాధ్యతల్ని తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌ కుమార్‌కు టీపీసీసీ అప్పగించింది. మరోవైపు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్ట్‌ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని.. హైకోర్ట్‌కి వెళ్లాలని సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..