AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay: రాజకీయాల్లోకి స్టార్‌ హీరో విజయ్‌.. నా లక్ష్యం అదేనంటూ..

తమిళనాట ఉన్నన్ని పార్టీలు, గ్రూపులు దేశంలో మరెక్కడా ఉండవు. ఇప్పటికే వందకు పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయి. తాజాగా తమిళ ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న దళపతి విజయ్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించడానికి సిద్ధమయ్యారు. అందుకు సబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా సిద్ధం చేసుకున్నారు. విజయ్ అభిమానులు...

Vijay: రాజకీయాల్లోకి స్టార్‌ హీరో విజయ్‌.. నా లక్ష్యం అదేనంటూ..
Vijay
Ch Murali
| Edited By: |

Updated on: Feb 02, 2024 | 2:15 PM

Share

తమిళనాట సినీ చరిష్మాతో ఇక్కడ ఇప్పటికే అనేక మంది రాజకీయాల్లోకి వచ్చి కొందరు సక్సెస్ కూడా అయ్యారు. ఇప్పుడు తమిళనాట మాస్ ఫాలోయింగ్ ఉన్న దళపతి గా అభిమానులు ఆరాధించే విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని నటుడు విజయ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

తమిళనాట ఉన్నన్ని పార్టీలు, గ్రూపులు దేశంలో మరెక్కడా ఉండవు. ఇప్పటికే వందకు పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయి. తాజాగా తమిళ ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న దళపతి విజయ్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించడానికి సిద్ధమయ్యారు. అందుకు సబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా సిద్ధం చేసుకున్నారు. విజయ్ అభిమానులు ఎప్పటి నుంచి విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరుతో ఒక అభిమాన సంఘాన్ని నడుపుతున్నారు. విజయ్ మక్కల్ ఇయక్కమ్ తరపున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే రెండేళ్ల క్రితమే స్థానిక సంస్థలు ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కమ్ తరపున పోటీ చేసిన విజయ్ అభిమానులు 261 స్థానాలకు పోటీ పడగా 169 చోట్ల గెలుపొందారు.

నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఫలితాల తర్వాత కాస్త క్లారిటీ వచ్చింది. పొలిటికల్ ఎంట్రీకి ముందు జనం నుంచి స్పందన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకే ఆ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయించారని అప్పట్లో టాక్. ఎట్టకేలకు విజయ్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసారు. తాను రాజకీయాల్లోకి రావడానికి కారణాలు, పార్టీ పెరు కూడా ప్రకటించేశారు. ట్విట్టర్ వేదికగా అభిమానులకు రెండు పేజీల లేఖను విడుదల చేశారు. తాను స్థాపించబోయే పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం గా పార్టీ పేరు ఉంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు.

పార్టీ జెండా.. అజెండా తాలూకు పూర్తి విషయాలను త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. ప్రస్తుత పాలనలో అవినీతి పెరిగిపోయిందని అందుకే తాను రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తాను ఇంతటి స్థాయికి రావడానికి కారణమైన అభిమానులకు ముందుగా ఈ విషయాన్ని తెలియజేయాలని అనుకున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఈ ఎన్నికలే టార్గెట్ గా విజయ్ పార్టీ ఏర్పాటు చేయనున్నారని అందరూ భావించారు.

అయితే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు విజయ్. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ తొలి టార్గెట్ అంటూ స్పష్టం చేశారు. అందుకోసం ఇప్పటి నుంచే సంస్థాగతంగా సిద్ధమవ్వాలని అందుకోసం త్వరలోనే కార్యాచరణ ఉంటుందన్నారు విజయ్. మొత్తానికి విజయ్ రాజకీయ ప్రకటనతో ఫలితం ఎలా ఉండబోతోంది.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అన్నది తమిళనాట చర్చ జరుగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..