Jan Samarth: ఇకపై చాలా ఈజీగా ఆన్‌లైన్‌లో లోన్.. ప్రభుత్వం తెచ్చిన కొత్త పోర్టల్‌తో 13 పథకాలు ఒకే చోట..!

జన్ సమర్థ్ అనేది ఒక డిజిటల్ పోర్టల్. ఇక్కడ 13 క్రెడిట్ లింక్డ్ ప్రభుత్వ పథకాలు ఒకే ప్లాట్‌ఫారమ్‌లో లింక్ చేశారు. లబ్ధిదారులు సులువైన దశల్లో వారి అర్హతను డిజిటల్‌గా తనిఖీ చేసుకోవచ్చు. అర్హత ఉన్న పథకాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Jan Samarth: ఇకపై చాలా ఈజీగా ఆన్‌లైన్‌లో లోన్.. ప్రభుత్వం తెచ్చిన కొత్త పోర్టల్‌తో 13 పథకాలు ఒకే చోట..!
Jan Samarth Portal
Follow us

|

Updated on: Jun 07, 2022 | 12:00 PM

క్రెడిట్-లింక్డ్ ప్రభుత్వ పథకాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ‘జన్ సమర్థ్ పోర్టల్'(Jan Samarth Portal)ను సోమవారం ప్రారంభించారు. దీంతో ప్రభుత్వ పథకం కింద రుణం తీసుకోవడం మరింత సులభతరం కానుంది. 13 ప్రభుత్వ పథకాల కింద రుణాలు తీసుకోవడానికి ఈ పోర్టల్ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. ప్రస్తుతం నాలుగు కేటగిరీల రుణాలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. వీటిలో విద్య, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, వ్యాపార ప్రారంభం, జీవన రుణాలు లాంటివి ఉన్నాయి. రుణ దరఖాస్తు నుంచి దాని ఆమోదం వరకు, అన్నీ జన్ సమర్థ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. దరఖాస్తుదారులు పోర్టల్‌లో తమ రుణ స్థితిని కూడా తనిఖీ చేయగలుగుతారు. దరఖాస్తుదారులు రుణం పొందకపోతే ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.

3 రోజుల్లో సమస్య పరిష్కారం..

దరఖాస్తుదారు ఫిర్యాదును మూడు రోజుల్లో పరిష్కరించాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జన్ సమర్థ్ పోర్టల్‌లో దరఖాస్తుదారుతో పాటు, బ్యాంకులు, వివిధ చిన్న, పెద్ద రుణ సంస్థలు కూడా అందుబాటులో ఉంటాయని, వారు రుణం కోసం ఇన్‌కమింగ్ అప్లికేషన్‌పై తమ ఆమోదాన్ని ఇస్తారు. ప్రస్తుతం, బ్యాంకులతో సహా 125 కంటే ఎక్కువ ఆర్థిక సంస్థలు ఈ పోర్టల్‌కు అనుసంధానించారు.

ఇవి కూడా చదవండి

జన్ సమర్థ్ పోర్టల్ అంటే ఏమిటి?

జన్ సమర్థ్ అనేది ఒక డిజిటల్ పోర్టల్. ఇక్కడ 13 క్రెడిట్ లింక్డ్ ప్రభుత్వ పథకాలు ఒకే ప్లాట్‌ఫారమ్‌లో లింక్ చేశారు. లబ్ధిదారులు సులువైన దశల్లో వారి అర్హతను డిజిటల్‌గా తనిఖీ చేసుకోవచ్చు. అర్హత ఉన్న పథకాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిజిటల్ ఆమోదం కూడా పొందవచ్చు.

ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు?

ప్రస్తుతం ప్రతి లోన్ కేటగిరీ కింద 4 లోన్ కేటగిరీలు, బహుళ పథకాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఇష్టపడే లోన్ కేటగిరీ కోసం, ముందుగా కొన్ని సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీ అర్హతను తనిఖీ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు ఏదైనా పథకానికి అర్హులైతే, మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని తర్వాత మీరు డిజిటల్ ఆమోదం పొందగలరు.

ఎవరైనా రుణం కోసం దరఖాస్తు చేయవచ్చా?

అవును, ఎవరైనా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా, మీకు అవసరమైన లోన్ కేటగిరీకి సంబంధించిన అర్హతను మీరు చెక్ చేసుకోవాలి. అందులో మీరు అర్హులైతే, ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.