PM Kisan: పీఎం కిసాన్ యోజన్ ఈ-కేవైసీ దరఖాస్తు చేసుకోలేదా.. అయితే ఈ వివరాలు మీ కోసమే
పీఎం కిసాన్ యోజన(PM Kisan Yojana) ప్రయోజనాన్ని పొందుతున్న రైతులు ఇప్పుడు జూలై 31 నాటికి ఈ-కేవైసీ(E-KYC) పొందవచ్చు. మే 31 వరకు ఉన్న చివరి తేదీని అధికారులు పొడిగించారు. ఇందుకోసం రైతులు పీఎం...
పీఎం కిసాన్ యోజన(PM Kisan Yojana) ప్రయోజనాన్ని పొందుతున్న రైతులు ఇప్పుడు జూలై 31 నాటికి ఈ-కేవైసీ(E-KYC) పొందవచ్చు. మే 31 వరకు ఉన్న చివరి తేదీని అధికారులు పొడిగించారు. ఇందుకోసం రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. మొబైల్ నంబర్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలి. లింక్ చేసిన తర్వాత ఫోన్ కు వచ్చే ఓటీపీ ద్వారా సులభంగా ఈ – కేవైసీ పొందవచ్చు. ముందుగా pmkisan.gov.in వద్ద పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన తర్వాత, లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయాలి. రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామ వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేస్తే ప్రక్రియ పూర్తయినట్లే. ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి రూ. 2,000 చొప్పున మూడు వాయిదాలు (మొత్తం రూ. 6000) అందజేస్తారు. పథకం అర్హులైన లబ్ధిదారులు కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన స్థానిక పట్వారీ, రెవెన్యూ అధికారి, నోడల్ అధికారి మాత్రమే రైతులను నమోదు చేస్తున్నారు.
పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయా, లేదా అనే విషయాన్ని కూడా రైతులు సులభంగా తెలుసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి అందులో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇందుకుగానూ ఫార్మర్స్ కార్నర్‌లో ఉన్న బెనిఫీషియరీ స్టేటస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. దీనిపై క్లిక్ చేయాలి. తర్వాత కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సబ్‌మిట్ చేయాలి. డబ్బులు రాకపోవడానికి గల కారణాలను వివరిస్తుంది. డబ్బులు రాకపోతే ఎందుకు రాలేదో కారణం కూడా ఉంటుంది. దాన్ని సవరించుకుంటే మళ్లీ పీఎం కిసాన్ డబ్బులు పొందవచ్చు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి