AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కశ్మీర్ పర్యాటకం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి నిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్‌కు ఇప్పుడిప్పుడే స్వేచ్ఛ లభిస్తోంది. కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతుండటంతో.. కేంద్రం కశ్మీర్‌లోని ఆంక్షలను ఒక్కొక్కటిగా ఎత్తివేస్తోంది. దాదాపు రెండు నెలల అనంతరం కశ్మీర్ లోయ అందాలను వీక్షించడానికి పర్యాటకులను అనుమతించాలని అక్కడి గవర్నర్ సత్యపాల్ మాలిక్ నిర్ణయించారు. కశ్మీర్ విభజన నేపథ్యంలో రెండు నెలల క్రితం అనగా ఆగష్టులో వేలాది మంది పర్యాటకులను, విద్యార్థులను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని కశ్మీర్ వదిలి […]

కశ్మీర్ పర్యాటకం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!
Ravi Kiran
|

Updated on: Oct 11, 2019 | 12:39 AM

Share

ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి నిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్‌కు ఇప్పుడిప్పుడే స్వేచ్ఛ లభిస్తోంది. కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతుండటంతో.. కేంద్రం కశ్మీర్‌లోని ఆంక్షలను ఒక్కొక్కటిగా ఎత్తివేస్తోంది. దాదాపు రెండు నెలల అనంతరం కశ్మీర్ లోయ అందాలను వీక్షించడానికి పర్యాటకులను అనుమతించాలని అక్కడి గవర్నర్ సత్యపాల్ మాలిక్ నిర్ణయించారు.

కశ్మీర్ విభజన నేపథ్యంలో రెండు నెలల క్రితం అనగా ఆగష్టులో వేలాది మంది పర్యాటకులను, విద్యార్థులను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని కశ్మీర్ వదిలి వెళ్లిపోవాలని కేంద్రం అల్టీమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన జరిగాయి. అప్పటి నుంచి నిషేధాజ్ఞలతో కశ్మీర్ అందాలను తిలకించే భాగ్యం దేశ విదేశీ పర్యాటకులు కోల్పోయారు. అంతేకాక అక్కడ నివసిస్తున్న ప్రజలకు కూడా పలు ఆజ్ఞలు పెట్టి.. టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలను కేంద్రం బంద్ చేసింది. రాజకీయ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటుగా భారీ భద్రతా బలగాలను కశ్మీర్‌లో మోహరించి.. మునపటి వాతావరణాన్ని తిరిగి తీసుకొచ్చింది.

ప్రస్తుతం కశ్మీర్‌లోని పరిస్థితి మెరుగుపడటంతో కేంద్రం పర్యాటకానికి దారులు తెరిచింది. ముఖ్యంగా కశ్మీర్ లోయ ప్రకృతి అందాలను చూడడానికి దేశ విదేశాల నుంచి ఎందరో పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకమే అక్కడ స్థానికులకు జీవనోపాధి. అరవై రోజులు నుంచి పని లేక ఖాళీగా ఉంటున్న వారికి కేంద్రం తీపికబురు అందించిందని చెప్పొచ్చు.