AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటి వారిని తరిమేస్తాం.. అమిత్ షా

ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా నిలుస్తారు మోడీషాలు. తాము సెట్ చేసుకున్న ఎజెండాకే పెద్ద పీట వేస్తూ.. తరచూ ఏదో ఒక హాట్ టాపిక్‌ను తెర మీదకు తీసుకొచ్చే ఈ ద్వయం ప్రస్తుతం ఎన్‌ఆర్‌సీ అంటూ పెద్ద సంచలనం సృష్టించారు. ఇక ఈ అంశం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న వేళ.. దీనిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల నాటికి దేశంలో అక్రమంగా నివసిస్తున్న […]

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటి వారిని తరిమేస్తాం.. అమిత్ షా
Ravi Kiran
| Edited By: |

Updated on: Oct 11, 2019 | 8:18 AM

Share

ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా నిలుస్తారు మోడీషాలు. తాము సెట్ చేసుకున్న ఎజెండాకే పెద్ద పీట వేస్తూ.. తరచూ ఏదో ఒక హాట్ టాపిక్‌ను తెర మీదకు తీసుకొచ్చే ఈ ద్వయం ప్రస్తుతం ఎన్‌ఆర్‌సీ అంటూ పెద్ద సంచలనం సృష్టించారు. ఇక ఈ అంశం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న వేళ.. దీనిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

2024 ఎన్నికల నాటికి దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారందరిని గెంటివేస్తామంటూ అమిత్ షా చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం హర్యానా అసెంబ్లీకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కథియాల్ జిల్లాకు పర్యటించిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేయడంతో మరోసారి వివాదానికి తెర లేపారు.

70 ఏళ్లుగా అక్రమ వలసదారులు దేశ ప్రజలందరికి అందాల్సినవి అనుభవిస్తూ.. ధైర్యంగా బతుకుతున్నారని.. అలాంటివారిని దేశం నుంచి పంపించే సమయం దగ్గరపడిందన్నారు. 2024లో మరోసారి ఓట్లు అడిగేందుకు ప్రజల ముందుకువస్తామని.. అంతకుముందే.. ఈ అక్రమ వలసదారులు దేశంలో ఉండరని అమిత్ షా స్పష్టం చేశారు.

బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ వంటి నిర్ణయాలు దేశానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక రఫెల్ ఫైటర్ జెట్‌కు డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాధ్ సింగ్ చేసిన ఆయుధ పూజను హేళన చేసిన కాంగ్రెస్‌పై కూడా అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు.

Follow Us
రైతన్నలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు!
రైతన్నలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు!
అతి మంచితనం మీ జీవితాన్నే దెబ్బతీయొచ్చు.. చాణక్య నీతి హెచ్చరిక!
అతి మంచితనం మీ జీవితాన్నే దెబ్బతీయొచ్చు.. చాణక్య నీతి హెచ్చరిక!
మర్రి ఆకులను పూజలో వాడుతున్నారా? ఈ దేవతలకు సమర్పిస్తే శుభం..
మర్రి ఆకులను పూజలో వాడుతున్నారా? ఈ దేవతలకు సమర్పిస్తే శుభం..
కరోనా సృష్టించిన వుహాన్ ల్యాబ్‌కు అమెరికా నిధులా?
కరోనా సృష్టించిన వుహాన్ ల్యాబ్‌కు అమెరికా నిధులా?
పాము గుడ్లను తింటే మనిషి చనిపోతాడా..? 99శాతం మందికి తెలియని..
పాము గుడ్లను తింటే మనిషి చనిపోతాడా..? 99శాతం మందికి తెలియని..
ఐపీఎల్‌లోకి సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. వచ్చే ఏడాది సరికొత్తగా..
ఐపీఎల్‌లోకి సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. వచ్చే ఏడాది సరికొత్తగా..
అర్ధరాత్రి వదిన లేదని తెలిసి ఇంట్లోకి చొరబడ్డ మరదలు!
అర్ధరాత్రి వదిన లేదని తెలిసి ఇంట్లోకి చొరబడ్డ మరదలు!
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో దూరిన ఆవు,ప్లేయర్లు పరుగో పరుగు!వీడియో చూస్తే
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో దూరిన ఆవు,ప్లేయర్లు పరుగో పరుగు!వీడియో చూస్తే
సాలగ్రామాన్ని ఇంట్లో ఉంచుకోవడం మంచిదేనా? అపోహలు, వాస్తవాలు..
సాలగ్రామాన్ని ఇంట్లో ఉంచుకోవడం మంచిదేనా? అపోహలు, వాస్తవాలు..
ట్రాఫిక్ చలాన్ వేసిన పోలీసుకే చుక్కలు చూపిన యువకుడు!
ట్రాఫిక్ చలాన్ వేసిన పోలీసుకే చుక్కలు చూపిన యువకుడు!