Catwalk in Burqa: ముజఫర్‌నగర్‌లో బుర్ఖాతో క్యాట్‌వాక్.. భగ్గుమంటున్న ముస్లిం సంస్థలు
ర్యాంప్‌పై బుర్ఖాతో ముస్లిం మహిళల క్యాట్‌వాక్ యూపీలో సంచలనం రేపుతోంది. ముజఫర్‌నగర్ కాలేజ్ ఈ ఫ్యాషన్‌షోపై ముస్లిం సంస్థలు మండిపడుతున్నాయి. Splash 2023 పేరిట నిర్వహించిన ఫ్యాషన్‌షోకు బాలీవుడు నటులు మందాకిని , రాధికా గౌతమ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ర్యాంప్‌పై బుర్ఖాతో ముస్లిం మహిళల క్యాట్‌వాక్ ఉత్తరప్రదేశ్‌లో సంచలనం రేపుతోంది. ముజఫర్‌నగర్ కాలేజ్ ఈ ఫ్యాషన్‌షోపై ముస్లిం సంస్థలు మండిపడుతున్నాయి. ముస్లిం మహిళలు బుర్ఖా ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ ప్రాంతంలోని ఒక కాలేజ్‌లో జరిగిన ఈ ఘటనపై వివాదం రాజుకుంది. స్థానిక కాలేజ్‌లో నిర్వహించిన ఫ్యాషన్ షో సందర్భంగా బుర్ఖా ధరించి కొందరు క్యాట్‌వాక్ చేయడంపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. విద్యాసంస్థలో ఇలాంటి షోలు నిర్వహించడం దారుణమని ఆరోపించాయి. ఇలాంటి ఘటనలు రిపీట్ అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ముస్లిం సంస్థలు హెచ్చరించాయి.
Splash 2023 పేరిట నిర్వహించిన ఫ్యాషన్‌షోకు బాలీవుడు నటులు మందాకిని , రాధికా గౌతమ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. బుర్ఖా ధరించి క్యాట్‌వాక్ చేసిన మహిళలు ప్రేక్షకులను ఆదాబ్ అని పలుకరించారు. ముస్లిం మహిళలు తమ ప్రతిభను కనబర్చడానికి ఇది వేదికని నిర్వాహకులు తెలిపారు. అయితే నిర్వహకులు తీరును తప్పుపట్టారు జామియా ఉలేమియా సంస్థ నేతలు.
ఫ్యాషన్ షోలో ప్రదర్శించాల్సిన ఐటమ్ బుర్ఖా కాదని ముస్లిం సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరిగితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. అయితే బుర్ఖాను దుస్తుల లాగా మాత్రమే చూడకూడదని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధునాతన దుస్తుల్లో ఫ్యాషన్‌షోలకు హాజరుకావడం తమకు వీలు కాదని , అందుకే బుర్ఖాతో షోలో పాల్గొనట్టు పార్టిసిపెంట్స్ చెబుతున్నారు.
ఫ్యాషన్ షోలకు తాము వ్యతిరేకం కాదని , కాని మతపరమైన భావనలు రెచ్చగొట్టకుండా ఉండాలని మరికొంతమంది ముస్లిం ప్రముఖులు సూచిస్తున్నారు.
Catwalk in burqa in Shriram College, Muzaffarnagar!!
Jamiat Ulema said – "Burqa is not a part of fashion, it is used for curtain. College students should not do this in future." pic.twitter.com/fjeWgel6SE
— T R A N S L A T O R (@enghinditweets) November 27, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..