Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్‌ టన్నెల్‌లో ఆపరేషన్‌ సక్సెస్‌.. 41 మందిని రక్షించిన NDRF

ర్యాట్‌హోల్‌ మైనింగ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో కీలకపాత్ర పోషించారు. కార్మికులు క్షేమంగా బయటకు కావడంతో వాళ్ల కుటుంబసభ్యులు చాలా ఆనందంగా ఉన్నారు. రెస్క్యూ సిబ్బందికి వాళ్లు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులు క్షేమంగా బయటకు రావడంతో వాళ్ల కుటుంబసభ్యులు స్వీట్లు పంచుకున్నారు.

Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్‌ టన్నెల్‌లో ఆపరేషన్‌ సక్సెస్‌.. 41 మందిని రక్షించిన NDRF
Uttarakhand Tunnel
Follow us
Venkata Chari

| Edited By: Narender Vaitla

Updated on: Nov 28, 2023 | 11:14 PM

Uttarakhand Tunnel Rescue: వాళ్లంతా మృత్యుంజయులు.. ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీ టన్నెల్‌లో గత 17 రోజులుగా నరకం చూసిన 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. ఒక్కొక్కరు బయటకు తీసుకొచ్చారు NDRF సిబ్బంది. బయటకు వచ్చిన కార్మికులను వెంటనే అంబులెన్స్‌ల్లో ఆస్పత్రికి తరలించారు. .

అత్యవసర వేళ్లలో ఉపయోగించడానికి ఆర్మీ హెలికాప్టర్‌ను కూడా రెడీ చేశారు. కార్మికుల కోసం 41 వార్డులను కూడా ఆస్పత్రిలో సిద్దం చేశారు. సిల్వారా టన్నెల్‌లో ఈనెల 12వ తేదీన కార్మికులు చిక్కుకుపోయారు. దీంతో వాళ్ల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 41 మందిని రక్షించడంతో వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఎస్కేప్‌ పైప్‌ నుంచి కార్మికులను బయటకు తీసుకొచ్చారు. టన్నెల్‌ నుంచి బయటకు వచ్చిన కార్మికులు ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలను ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి స్వయంగా పర్యవేక్షించారు. టన్నెల్‌ లోపలికి వెళ్లి పరిస్థితిని ఆయన స్వయంగా సమీక్షించారు.

ర్యాట్‌హోల్‌ మైనింగ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో కీలకపాత్ర పోషించారు. కార్మికులు క్షేమంగా బయటకు కావడంతో వాళ్ల కుటుంబసభ్యులు చాలా ఆనందంగా ఉన్నారు. రెస్క్యూ సిబ్బందికి వాళ్లు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులు క్షేమంగా బయటకు రావడంతో వాళ్ల కుటుంబసభ్యులు స్వీట్లు పంచుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..