Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: రాత్రి వేళ కారు భీభత్సం..సీసీ కెమెరాలో రికార్డైన షాకింగ్‌ దృశ్యాలు చూస్తే..

ప్రమాదంలో ఇద్దరు మరణించటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహనికి గురయ్యారు. మృతుల బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబానికి సరైన పరిహారం, ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Watch: రాత్రి వేళ కారు భీభత్సం..సీసీ కెమెరాలో రికార్డైన షాకింగ్‌ దృశ్యాలు చూస్తే..
Jaipur Hit And Run Case
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 08, 2025 | 11:26 AM

రాజస్థాన్‌లోని జైపూర్‌లో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా ప్రమాద సంఘటన వెలుగులోకి వచ్చింది. జైపూర్‌లోని నహర్‌గడ్ ప్రాంతంలో ఒక SUV కారు అతివేగంతో రోడ్డుపై నడుస్తున్న మనుషులపై, బైక్‌ల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్టుగా తెలిసింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి జైపూర్ పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. జైపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలాజీ మలుపు దగ్గర నిందితుడైన కారు డ్రైవర్ నిర్లక్షంగా అతివేగంతో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. అంతేకాదు.. ప్రమాదం జరిగిన వెంటనే అతడు కారు దిగి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. స్థానికులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని కారును స్వాధీనం చేసుకున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ప్రమాదంలో ఇద్దరు మరణించటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహనికి గురయ్యారు. మృతుల బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. జైపూర్‌లోని నహర్‌గఢ్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబానికి సరైన పరిహారం, ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..