వీళ్లనేం చేయాలి ? ఫేక్ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల రాకెట్‌లో జబల్పూర్ ఆసుపత్రి డైరెక్టర్ అరెస్ట్, మరో నలుగురు కూడా !

మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో ఫేక్ రెమ్ డెసివిర్ ఇంజక్షన్ల రాకెట్ లో ఓ ఆసుపత్రి డైరెక్టర్ తో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.కోవిడ్ రోగుల చికిత్సలో వాడే ఈ ఇంజక్షన్లను..

  • Publish Date - 10:18 am, Tue, 11 May 21 Edited By: Anil kumar poka
వీళ్లనేం చేయాలి ? ఫేక్ రెమ్‌డెసివిర్   ఇంజక్షన్ల రాకెట్‌లో జబల్పూర్ ఆసుపత్రి డైరెక్టర్ అరెస్ట్, మరో నలుగురు కూడా !
Jabalpur Hospital Chief And Vhp Leader Held For Fake Remdesivir Racket

మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో ఫేక్ రెమ్ డెసివిర్ ఇంజక్షన్ల రాకెట్ లో ఓ ఆసుపత్రి డైరెక్టర్ తో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.కోవిడ్ రోగుల చికిత్సలో వాడే ఈ ఇంజక్షన్లను తమ ఆసుపత్రి పేరిట ఇండోర్ నుంచి తెప్పించుకుని సరబ్ జిత్ సింగ్ మోఖా అనే ఈ డైరెక్టర్ అసలైన వాటిని రోగులకు వినియోగించకుండా నకిలీ ఇంజెక్షన్లను ఇచ్చేవాడని తెలిసింది. ఇతడు నర్మదా డివిజన్ విశ్వ హిందూ పరిషద్ అధ్యక్షుడు కూడానట. ఇండియన్ పీనల్ కోడ్ లోని వివిధ సెక్షన్ల కింద ఇతడిని, ఇతడికి సహకరిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ రాకెట్ లో ఇతని మేనేజర్ దేవేంద్ర చౌరాసియా, ఫార్మాస్యుటికల్స్ డీలర్ సపన్ జైన్, మరికొందరు ఉన్నారని పోలీసులు తెలిపారు. జబల్పూర్ లో ఈ నెల 7 న పోలీసులు ఫేక్ రెమ్ డెసివిర్ ఉత్పత్తి యూనిట్ పై దాడి చేసినప్పుడు ఈ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే సరబ్ జిత్ మోఖా తమ సంస్థ నర్మదా డివిజన్ అధ్యక్షుడు కాదని, ఆ బాధ్యతల నుంచి అతడిని ఎప్పుడో రిలీవ్ చేశామని విశ్వహిందూ పరిషద్ నేత రాజేష్ తివారీ తెలిపారు.

కాగా ఛింద్వారా లో కూడా కొందరు ఆక్సిజన్ సిలిండర్లను 20 వేలరూపాయల చొప్పున అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. ఈ రాకెట్ లో నలుగురిని అరెస్టు చేశామన్నారు. వీరి వెనుక మరికొందరి హస్తం కూడా ఉండవచ్చునని భావిస్తున్నామన్నాయి, వారిని కూడా పట్టుకుంటుంటామని ఖాకీలు వెల్లడించారు. కొందరు పార్టీ నేతల ప్రమేయం కూడా ఉన్నట్టు తెలుస్తోందని వారు చెప్పారు. దేశంలో కోవిడ్ కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఒకటి. మహారాష్ట్ర, ఢిల్లీ తరువాత ఈ రాష్ట్రంలోనూ అధికంగా కేసులు నమోదవుతున్నాయి.

మరిన్ని చదవండి ఇక్కడ :Viral Video : టైర్ పై ఆ స్టాంట్స్ ఏంట్రా స్వామి …టాలెంట్ కు నెటిజెన్లు ఫిదా ! వైరల్ అవుతున్న వీడియో.

 Tirupati Ruia Hospital Live Video: తిరుపతి రుయా హాస్పిటల్ లో నిలిపోయిన ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా… ప‌లువురి ప‌రిస్థితి విష‌మం..!(వీడియో)