AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adiyogi Statue: అన్ని అనుమతులతోనే ఆదియోగి విగ్రహాన్ని ప్రతిష్ఠించాం.. ఎవరి భూముల ఆక్రమించలేదు: ఇషా ఫౌండేషన్‌

బెంగళూరులోని చిక్‌బళ్లాపూర్ తాలూకాలోని అవలగుర్కి గ్రామ సమీపంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాగా ఈ విగ్రహ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వెల్లియంగిరి హిల్ ట్రైబ్ ప్రొటెక్షన్ అసోసియేషన్ అధినేత ముత్తమ్మాళ్ హైకోర్టులో కేసు వేశారు.

Adiyogi Statue: అన్ని అనుమతులతోనే ఆదియోగి విగ్రహాన్ని ప్రతిష్ఠించాం.. ఎవరి భూముల ఆక్రమించలేదు: ఇషా ఫౌండేషన్‌
Adiyogi Statue
Basha Shek
|

Updated on: Sep 02, 2023 | 7:56 PM

Share

బెంగళూరులోని చిక్‌బళ్లాపూర్ తాలూకాలోని అవలగుర్కి గ్రామ సమీపంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాగా ఈ విగ్రహ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వెల్లియంగిరి హిల్ ట్రైబ్ ప్రొటెక్షన్ అసోసియేషన్ అధినేత ముత్తమ్మాళ్ హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసు చెన్నై హైకోర్టులో ఐదేళ్లకు పైగా నడుస్తోంది. తాజాగా ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. దీనికి సంబంధించి కోయంబత్తూరు రీజినల్ టౌన్ ప్లానింగ్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఆర్.రాజగురు కోర్టులో నివేదిక సమర్పించారు. అందులో, ఆదియోగి విగ్రహం, నిర్మాణ పనులకు సంబంధంచి తమ కార్యాలయంలో ఎటువంటి అనుమతి పత్రాలు లేవని తెలిపారు. . జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్‌కు సంబంధించిన పత్రాలు కూడా లేవన్నారు. విగ్రహ ఏర్పాటుకు సరైన అనుమతి తీసుకోలేదని తేలితే చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొంది. దీనిపై ఇషా ఫౌండేషన్‌ స్పందించింది.

ఆరోపణలు అవాస్తవం

ఆదియోగి విగ్రహానికి తగిన అనుమతి పత్రాలు తమ దగ్గర ఉన్నాయని, వాటిని ఎక్కడైనా, ఎప్పుడైనా సమర్పిస్తామని ఇషా ఫౌండేషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనుమతితోనే ఆదియోగి విగ్రహాన్ని నిర్మించినట్లు ఇశా అధికార ప్రతినిధి తిరు దినేష్ రాజా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోయంబత్తూరులోని ఆదియోగి శివ విగ్రహాన్ని 2017లో ఆవిష్కరించారు. కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ 2016లో ఆదియోగి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చారు. కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ అనుమతితో ఆదియోగి విగ్రహాన్ని నిర్మించాం. ఎలాంటి అనుమతులు లేకుండా ఆదియోగి విగ్రహాన్ని నిర్మించారని చెప్పడం అవాస్తవం. కోయంబత్తూరు పట్టణానికి ఆధ్యాత్మిక చిహ్నాం ఆదియోగి విగ్రహం. సాధారణంగా, ఏదైనా విగ్రహాలను స్థాపించాలంటే జిల్లా కలెక్టర్ నుండి అనుమతి తప్పనిసరి. దీని ప్రకారం 2016లో ఆదియోగిని ప్రతిష్టించేందుకు జిల్లా కలెక్టర్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాం. జిల్లా కలెక్టర్, తనిఖీ నివేదికలు, సంబంధిత శాఖల సిఫార్సుల ఆధారంగా, మా దరఖాస్తును పరిశీలించారు. ఆదియోగిని ప్రతిష్టించడానికి సెప్టెంబర్ 2016లో అనుమతి ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం.. మేము మా వద్ద అందుబాటులో ఉన్న పత్రాలను టౌన్ ప్లానింగ్ విభాగానికి సమర్పించాం’ ఇని తెలిపారు.

ఎవరి భూములు ఆక్రమించలేదు..

ఇక గిరిజనులకు చెందిన 44 ఎకరాల భూమిని ఇషా ఆక్రమించారనే ఆరోపణలపై స్పందిస్తూ, “ఈషా ఎవరి భూమిని ఆక్రమించలేదు. “44 ఎకరాల భూమి” ఇషా తీసుకున్నట్లు వారు నిరూపిస్తే, మేము దానిని వెంటనే తిరిగి ఇస్తాము. దీనికి సంబంధించి ఆర్‌టిఐ ప్రశ్నకు సమాధానంగా, ఇషా 44 ఎకరాలను ఆక్రమించలేదని ఆర్‌టిఐ నివేదిక స్పష్టంగా పేర్కొంది. అలాగే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, తిరురాజా అడవులను నాశనం చేసి ఆదియోగి విగ్రహాన్ని నిర్మించారనే ఆరోపణలన్నీ అబద్ధం, నిరాధారమని రుజువు చేస్తూ సంబంధిత పత్రాలు మరియు ఆధారాలను విలేకరులకు అందించారు. ఇందులో ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (EIA) అనుమతి పత్రాలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..