Watch Video: నాటు నాటు పాటకు స్టెప్పులేసిన మజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, సునీల్ గవాస్కర్.. వీడియో వైరల్
ఈ ఏడాది బెస్ట్ ఒరిజన్ సాంగ్ లో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసింది. దేశంలో ఎక్కడ చూసిన ఈ పాట మారుమోగిపోతుంది. విదేశాలలో కూడా ఈ పాటకు ఎంతోమంది స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో షేర్లు చేస్తున్నారు.

ఈ ఏడాది బెస్ట్ ఒరిజన్ సాంగ్ లో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసింది. దేశంలో ఎక్కడ చూసిన ఈ పాట మారుమోగిపోతుంది. విదేశాలలో కూడా ఈ పాటకు ఎంతోమంది స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో షేర్లు చేస్తున్నారు. ఏ ఇంట్లో ఫంక్షన్ జరిగినా, పెళ్లి జరిగినా లేదా పార్టీలు చేసుకున్న ఈ పాట ఉండాల్సిందే. ఇటీవల ఐపీఎల్ ప్రారంభోత్సవంలో కూడా ప్రముఖ నటీ రష్మిక మందన.. నాటు నాటుకు పాటకు స్టెప్పులేసి అందరగొట్టేసింది. అయితే ఈ పాటకున్న ఊపును ఆపుకోలేక క్రికెటర్లు కూడా డ్యాన్సులు చేస్తున్నారు. అయితే మాజీ క్రికెటర్లు, ఇర్ఫాన్ పఠాన్, సునీల్ గవస్కార్లు నాటు నాటు పాటకు వేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఐపీఎల్ ప్రారంభోత్సవంలో ఈ పాటకు రష్మిక మందన డ్యాన్స్ చేస్తుండగానే మరోవైపు ఇర్ఫాన్ పఠాన్, సునీల్ గవాస్కర్లు కూడా స్టెప్పులేశారు. ఈ వీడియోను ఇర్ఫాన్ పఠాన్ తన అధికారిక ఇన్స్ట్రామ్ లో షేర్ చేశాడు. మా ఇద్దరిలో ఎవరు బాగా చేశారో చెప్పండి అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడప. అయితే దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొంతమంది ఇర్ఫాన్ బాగా చేశాడని..మరికొంత మంది సునీల్ గవాస్కర్ బాగా చేశాడంటూ కామెంట్స్ పెట్టారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి.




View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..