IRCTC Ramayan Yatra: ఐఆర్‌సిటీసీ అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ.. ఏప్రిల్ 7 నుంచి రామయణ్ యాత్ర..

|

Mar 16, 2023 | 1:16 PM

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య, ప్రయాగ్‌రాజ్, వారణాసి సహా ఇతర రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక ప్రదేశాలతో సహా శ్రీరాముడి జీవితానికి సంబంధించిన అనేక ప్రముఖ ప్రదేశాలను కవర్ చేస్తూ ఏప్రిల్ 7వ తేదీ నుంచి ‘రామాయణ యాత్ర’ రైలు ప్రారంభం కానుంది.

IRCTC Ramayan Yatra: ఐఆర్‌సిటీసీ అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ.. ఏప్రిల్ 7 నుంచి రామయణ్ యాత్ర..
Ramayana Yatra Irctc
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య, ప్రయాగ్‌రాజ్, వారణాసి సహా ఇతర రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక ప్రదేశాలతో సహా శ్రీరాముడి జీవితానికి సంబంధించిన అనేక ప్రముఖ ప్రదేశాలను కవర్ చేస్తూ ఏప్రిల్ 7వ తేదీ నుంచి ‘రామాయణ యాత్ర’ రైలు ప్రారంభం కానుంది. న్యూఢిల్లీ నుంచి ఈ రైలును పునఃప్రారంభించనుంది ఇండియన్ రైల్వేస్. ప్రతిపాదిత రైలు పర్యటనను భారత్ గౌరవ్ డీలక్స్ AC టూరిస్ట్ రైలులో ఆధునిక సౌకర్యాలు కలిగి ఉంటాయి. ఇప్పటి వరకు 26 భారత్ గౌరవ్ రైళ్లను ప్రారంభించారు.

ఇండియన్ రైల్వేస్ ఒక ప్రకటనలో.. “రైలులో ప్రయాణించే పర్యాటకులకు అయోధ్యలో హాల్ట్ ఇవ్వబడుతుంది. అక్కడ టూరిస్టులు శ్రీరామ జన్మభూమి ఆలయం, హనుమాన్ ఆలయాన్ని సందర్శించి, సరయు హారతిని చూడగలుగుతారు. ఈ రైలు 18 రోజుల పర్యటనలో నందిగ్రామ్, సీతామర్హి, జనక్‌పూర్, బక్సర్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరం, భద్రాచలం, నాగ్‌పూర్ తదితర ప్రాంతాలను కూడా కవర్ చేస్తుంది.’’ అని పేర్కొనడం జరిగింది.

ఇవి కూడా చదవండి

భారత ప్రభుత్వం ‘‘దేఖో అప్నా దేశ్’’, ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ విజన్‌లను ప్రోత్సహించడానికి భారత రైల్వేలు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను నడుపుతున్నాయి. ఇండియన్ రైల్వేస్ ప్రకారం.. ప్రతిపాదిత ట్రైన్ పర్యటన భారత్ గౌరవ్ డీలక్స్ AC టూరిస్ట్ రైలులో 156 మంది పర్యాటకులకు వసతి కల్పించే AC-I, AC-II తరగతి కోచ్‌ల వంటి ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంటుంది.

IRCTC శ్రీ రామాయణ యాత్ర రైలు వివరాలు..

ఈ రైలులో ప్రతి కోచ్‌కు CCTV కెమెరాలు, సెక్యూరిటీ గార్డులతో భద్రతను పెంచారు. పర్యాటకులు ఢిల్లీ, ఘజియాబాద్, అలీగఢ్, తుండ్లా, ఇటావా, కాన్పూర్, లక్నో రైల్వే స్టేషన్లలో కూడా ఎక్కవచ్చు. ఈ రైలు మొదటి హాల్ట్ అయోధ్య తరువాత నందిగ్రామ్ వద్ద భారత్ మందిర్, బీహార్‌లోని సీతామర్హి. ఇక్కడ పర్యాటకులు సీతా జన్మస్థలం, నేపాల్‌లోని జనక్‌పూర్‌లోని రామ్ జానకీ ఆలయాన్ని సందర్శిస్తారు.

సీతామర్హి తర్వాత రైలు బక్సర్, వారణాసికి వెళుతుంది. ఇక్కడ పర్యాటకులు కాశీ విశ్వనాథ్ ఆలయం, కాశీ కారిడార్, తులసి మందిర్, సంకట్ మోచన్ హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత రైలు ప్రయాగ్‌రాజ్, శృంగ్‌వేర్‌పూర్, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరం, భద్రాచలం, నాగ్‌పూర్‌కు చేరుకుని ఢిల్లీలో ముగుస్తుందని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ట్రైన్ ఫీచర్స్ ఇవే..

ఈ ట్రైన్‌లో రెండు ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, ఆధునిక వంటగది, కోచ్‌లలో షవర్ క్యూబికల్స్, సెన్సార్ ఆధారిత వాష్‌రూమ్ ఫంక్షన్‌లు, ఫుట్ మసాజర్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

IRCTC శ్రీ రామాయణ యాత్ర.. ఒక్కో వ్యక్తికి ఖర్చు..

IRCTC టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ప్యాకేజీ 2ACకి రూ. 1,14,065, 1 AC క్లాస్ క్యాబిన్‌కు రూ. 1,46,545, 1AC కూపేకి రూ. 1,68,950. AC హోటళ్లలో వసతి, అన్ని రకాల వెజ్ భోజనం సదుపాయం, ట్రాన్స్‌పరెంట్ ఏసీ వాహనాల్లో ప్రయాణం, ప్రయాణ బీమా వంటివి కూడా ఉన్నాయి.

IRCTC శ్రీ రామాయణ యాత్ర:

అయోధ్య : రామజన్మభూమి ఆలయం, హనుమాన్ గర్హి, సరయూఘాట్.

నందిగ్రామ్ : భారత్-హనుమాన్ దేవాలయం, భరత్ కుండ్.

జనక్‌పూర్ : రామ్-జానకీ మందిర్.

సీతామర్హి : సీతామర్హి, పునౌర ధామ్‌లోని జానకీ మందిరం.

బక్సర్: రామ్ రేఖ ఘాట్, రామేశ్వరనాథ్ ఆలయం.

వారణాసి : తులసి మానస్ ఆలయం, సంకట్ మోచన్ ఆలయం, విశ్వనాథ్ ఆలయం & గంగా ఆరతి.

సీతా సమాహిత్ స్థల్, సీతామర్హి : సీతా మాత ఆలయం.

ప్రయాగరాజ్ : భరద్వాజ ఆశ్రమం, గంగా-యమునా సంగమం, హనుమాన్ దేవాలయం.

శృంగవేర్పూర్ : శృంగే రిషి సమాధి, శాంతా దేవి ఆలయం, రామ్ చౌరా.

చిత్రకూట్ : గుప్త గోదావరి, రామ్‌ఘాట్, సతీ అనుసూయ ఆలయం.

నాసిక్ : త్రయంబకేశ్వర్ ఆలయం, పంచవటి, సీతాగుఫా, కాలరామ్ ఆలయం.

హంపి : అంజనాద్రి కొండ, విరూపాక్ష దేవాలయం, విఠల్ దేవాలయం.

రామేశ్వరం : రామనాథస్వామి ఆలయం, ధనుష్కోడి.

భద్రాచలం: శ్రీ సీతారామ స్వామి ఆలయం, అంజనీ స్వామి ఆలయం.

IRCTC రామాయణ్ యాత్ర రైలు బోర్డింగ్, డి-బోర్డింగ్ స్టేషన్లు..

బోర్డింగ్ స్టేషన్లు – ఢిల్లీ సఫ్దర్‌జంగ్, ఘజియాబాద్, అలీఘర్, తుండ్లా, ఇటావా, కాన్పూర్, లక్నో.

డి-బోర్డింగ్ స్టేషన్లు – విరంగన లక్ష్మీ బాయి, గ్వాలియర్, ఆగ్రా, మధుర.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..