Tiger: దేశంలో ఏటేటా పెరుగుతున్న పులుల సంఖ్య.. అత్యధికంగా నల్లమల ఫారెస్ట్‌లోనే..

Tiger: దేశ వ్యాప్తంగా పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకు కేంద్ర ప్రభుత్వం..

Tiger: దేశంలో ఏటేటా పెరుగుతున్న పులుల సంఖ్య.. అత్యధికంగా నల్లమల ఫారెస్ట్‌లోనే..
Tiger
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 29, 2022 | 2:57 PM

Tiger: దేశ వ్యాప్తంగా పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకు కేంద్ర ప్రభుత్వం ఘనాంకాలు విడుదల చేసింది. దీని ప్రకారం.. దేశ వ్యాప్తంగా 2,967 పులులు ఉన్నాయి. ఏటేటా పులుల సంఖ్య పెరుగుతోంది. అయితే, ఒక్క శ్రీశైలం టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌లోనే 63 పులులు ఉన్నట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. విస్తీర్ణ పరంగా దేశంలోనే అతిపెద్దదైన శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లోనూ పులుల సంచారం పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

70 శాతం దేశంలోనే.. కాగా, ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. 70 శాతం పులులు మన దేశంలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్య 4 వేలు. అందులో 70 శాతానికి మించి భారత్‌లోనే ఉన్నాయి. ఇఖ దేశవ్యాప్తంగా 53 పులుల అభయారణ్యాలున్నాయి. 2006లో దేశంలో 1,411 పులులు ఉండగా.. 2018 నాటికి వాటి సంఖ్య 2,967కు చేరింది. పన్నెండేళ్లలో ఇంత వృద్ధి ఓ రికార్డు అనే చెప్పాలి. ప్రపంచంలో మరే దేశంలోనూ ఈ స్థాయిలో పెరుగుదల నమోదు కాలేదు. దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్‌ – శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ (ఎన్‌ఎస్‌టీఆర్‌) జోన్‌‌లో 63 పులులు ఉననాయి.

ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతున్న పెద్ద పులుల సంఖ్య.. పర్యావరణ పరిరక్షణలో పులి పాత్ర కీలకం. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఈ పెద్ద పులుల సంఖ్య దారుణంగా పడిపోతోంది. ఈ నేపథ్యంలోనే పులుల సంరక్షణపై అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నాయి ప్రపంచ దేశాలు. ప్రతి ఏడాది జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు.

దేశంలోనే పెద్దది ఎన్‌ఎస్‌టీఆర్‌.. నాగార్జునసాగర్‌– శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ (ఎన్‌ఎస్‌టీఆర్‌) జోన్‌ దేశంలోకెల్లా అతి పెద్దది. ఆంధ్రప్రదేశ్‌లోని పూర్వపు గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది నల్లమల అటవీ ప్రాంతం. కృష్ణాతో పాటు దాని ఉప నదులు నల్లమల ఫారెస్ట్ గుండా ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల బ్యాక్‌ వాటర్, ఇతర వనరులతో నీటికి కొదవ లేదు. ఎత్తయిన కొండలు, భారీ లోయలు సహా భౌగోళికంగా అనువుగా ఉండటం పులుల సంచారానికి, వాటి ఎదుగుదలకు ఉపయుక్తంగా ఉంది.

నల్లమల టు శేషాచలం.. ఈ టైగర్ కారిడార్ నల్లమల అడవుల నుంచి శేషాచలం అడవుల వరకూ విస్తరించింది. ఇక్కడ పులుల సంచారం భారీగా పెరిగింది. కొన్నేళ్లుగా నల్లమల నుంచి కడప, చిత్తూరు జిల్లాల పరిధిలోని శేషాచలం అడవుల వరకూ పులుల సంచారం పెరిగింది. శేషాచలం బ్లాకులో మూడేళ్ల క్రితం కొత్తగా 6 పులులు సంచరించాయి. గతేడాది 3 పులుల సంచరించాయి. పులుల సంచారాన్ని గుర్తించడానికి టైగర్‌ రిజర్వు ప్రాంతంలో 597 అధునాతన మోషన్‌ సెన్సార్‌ కెమెరాలు ఏర్పాటు చేసింది ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్. ప్రతి 4 చదరపు కిలోమీటర్లకు రెండు కెమెరాలు ఏర్పాటు చేసింది. అడవిలో పులులు వెళ్లే ప్రధాన దారుల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు వాటి పరిధిలో ఏ వస్తువు కదిలినా ఫొటోలు తీస్తాయి. అలా తీసిన లక్షల ఫొటోలను ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా విశ్లేషిస్తారు. పులుల సంఖ్య, ఆ తర్వాత మిగిలిన జంతువులను లెక్కిస్తారు. పులి చర్మంపై ఉండే చారల ద్వారా పాత పులులు, కొత్త పులులను బేరీజు వేస్తారు. కాగా, జాతీయ స్థాయిలో ప్రతి నాలుగేళ్లకోసారి, రాష్ట్రాల్లో ప్రతి ఏడాదికోసారి పులుల సంఖ్యను లెక్కిస్తారు.

జంతువుల వేట నిషేధించాలి.. జంతువుల వేటను పూర్తిగా నిషేధించాలని జంతు ప్రేమికుల నుంచి గట్టి డిమాండ్లు వినిపిస్తున్నాయి. సహజంగానే పులి అత్యంత సున్నితమైన జంతువు. పులి సౌకర్యంగా జీవించడానికి తగిన పర్యావరణాన్ని ఏర్పరచడం కష్టం. పులికి ఆహారమైన జంతువుల సంఖ్య తగ్గకుండా చూసుకోవాలి. అడవికి నిప్పు పెట్టడం, జంతువులను వేటాడటం పూర్తిగా నిషేదించాల్సిన అవసరం ఉంది.

ఆమ్రాబాద్‌లోనూ పెరిగిన పులులు.. నల్లమల అటవీ ప్రాంతమైన అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు (ఏటీఆర్‌)లోను పులుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ‘ఆల్‌ ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌-2018’ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 26 పులులు (అమ్రాబాద్‌లో 16, కవ్వాల్‌లో 10) ఉన్నాయి. ఒక్క ఏటీఆర్‌లోనే 24 పులులు కెమెరా కంటికి చిక్కాయి. ఇక కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు (కేటీఆర్‌)లో 10-12 వరకు పులులను గుర్తించారు. వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు పంపిన పులుల లెక్కల ప్రకారం అప్పుడు ఏటీఆర్‌లో 19 పులులు ఉన్నాయి. తాజాగా మరో అయిదు పులుల జాడ కనిపించింది. కెమెరాలకు చిక్కనివి, అటవీ సిబ్బంది వెళ్లలేని దట్టమైన అటవీ ప్రాంతాలు, వాటిని పరిగణనలోకి తీసుకుంటే.. 30 వరకు పులులు ఉండే వీలుంది. ఇక్కడ మరో శుభపరిణామం ఏంటంటే.. సంతానాన్ని ఇచ్చే ఆడపులుల సంఖ్య పెరుగుతోంది. ఇది శుభపరిణామం అని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు అధికారులు అంటున్నారు.

నాలుగేళ్లకోసారి పులుల లెక్కల వెల్లడి.. వాస్తవానికి ప్రతీ నాలుగేళ్లకోసారి పులుల లెక్కలను వెల్లడిస్తారు. అయితే, ఈసారి మాత్రం ఏడాది ముందుగానే ప్రకటించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో ముందుగానే పులుల వివరాలను వెల్లడించారు. ఆగస్టు 15తో అమృత్ మహోత్సవాలు ముగియనుండగా.. ఈలోగానే ‘ఆల్‌ ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌-2022’ను ప్రధాని మోదీ వెల్లడించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?